సొంత జిల్లాపై ఫోక‌స్ పెడుతున్న క‌విత‌.. యాక్టివ్ పాలిటిక్స్‌

ఒక‌ప్పుడు కేసీఆర్ త‌న‌య క‌విత ఎంత‌లా చ‌క్రం తిప్పారో అంద‌రికీ తెలిసిందే.టీఆర్ ఎస్‌లో కేసీఆర్‌, కేటీఆర్ త‌ర్వాత ఆమెనే అన్న మాదిరిగా రాజ‌కీయాలు చేశారు.

 Kavitha Focusing On Ones Own District Active Politics-TeluguStop.com

ఎవ‌రికి ఏ ప‌దువు కావాల‌న్నా కూడా ఆమె క‌టాక్షం ఉండాల్సిందే అన్న రేంజ్‌లో టీఆర్ ఎస్ నేత‌లు ఆమెను కొలిచేవారు.అయితే 2018 లోక్ స‌భ ఎన్నికల్లో ఓడిపోయిన త‌ర్వాత ఆమె క‌నీసం సొంత జిల్లాకు కూడా దూరంగా ఉంటున్నారు.

యాక్టివ్ రాజకీయాలకు కూడా చాలా దూరంగా ఉన్నారు క‌విత‌.అయితే దీన్ని గ‌మ‌నించిన కేసీఆర్ ఆమెకు ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇచ్చి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు.

 Kavitha Focusing On Ones Own District Active Politics-సొంత జిల్లాపై ఫోక‌స్ పెడుతున్న క‌విత‌.. యాక్టివ్ పాలిటిక్స్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక అప్ప‌టి నుంచి కూడా ఆమె పెద్ద‌గా యాక్టివ్ పాలిటిక్స్ లో కొంత స్లోగానే ఉన్నా కూడా ఇప్పుడు ఆమె మళ్లీ చక్రం తిప్పడం మొదలెట్టారనే వార్త‌లు వినిపిస్తున్నాయి.ఇక సొంత జిల్లా అయిన నిజామాబాద్ పైనే బాగా ఫోక‌స్ పెడుతున్న‌ట్టు తెలుస్తోంది.

రాబోయే ఎన్నిక‌ల‌కు ఇప్పటి నుంచే సిద్ధం అవుతున్న‌ట్టు తెలుస్తోంది.ఇందులో భాగంగానే అక్క‌డి నేత‌ల‌కు ప‌ద‌వులు కూడా క‌ట్ట‌బెడుతున్నారంట‌.

ఇక తాజాగా నిజ‌మాబాద్ రూరల్ ఎమ్మెల్యే అయిన గోవర్ధన్‌కు ఆర్టీసీ చైర్మన్ క‌విత‌నే ఇప్పించార‌నే ప్ర‌చారం న‌డుస్తోంది.దీంతో ఉమ్మ‌డి జిల్లా నేత‌లు ఆమె వ‌ద్ద‌కు క్యూ కడుతున్నారు.

Telugu Kavitha, Kavitha Focusing On One\\'s Own District Active Politics, Politics-Telugu Political News

ఇక ఇప్ప‌డు పార్టీ ప‌ద‌వులు కూడా మె చెప్ఇన వారికే ద‌క్కుతున్నాయి.త‌న‌కు అనుకూలంగా ఉండే వారినే ఆమె ఏరికోరి మ‌రీ సెలెక్ట్ చేసుకుంటున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.ఇక ఉమ్మ‌డి జిల్లాలోఎనే మంత్రులతో పాటు ప్రభుత్వ విప్ లు కూడా ఉన్నా కవిత ఎవ‌రికి ప‌ద‌వులు అంటే వారికి దక్కుతాయనే పరిస్థితి ఇప్పుడు క‌నిపిస్తోంది.ఇక ఇప్పుడు నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు పార్టీ అధ్యక్షులుగా ఎవ‌రు ఉండాల‌నేదానిపై క‌విత మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

రాబోయే ఎన్నిక‌ల్లో త‌న‌కు మ‌ద్ద‌తుగా ఉండే వారికే ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతార‌ని స‌మాచారం.

.

#Kavitha #Kavitha Active

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు