కవిత వర్సెస్‌ పద్మావతి ఫైనల్‌ అయినట్లేనా?

గత ఏడాది చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.ఆ ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హుజూర్‌ నగర్‌ నియోజక వర్గం నుండి పోటీ చేశాడు.

 Kavitha And Padmavathi Final In Huzurnagar Constituency Trs-TeluguStop.com

అక్కడ భారీ ఎత్తున టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపు కోసం ప్రయత్నాలు చేశారు.కాని ఆయన ఓడిపోయారు.

ఇక నాలుగు నెలల క్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నల్లగొండ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసి గెలుపొందాడు.

ఎంపీగా గెలుపొందిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

రాజీనామా చేసి తన భార్య పద్మావతిని బరిలోకి దించి గెలిపించుకునేందుకు ఉత్తమ్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు.ఈ సమయంలోనే టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున పోటీ చేసేది ఎవరా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను దించే అవకాశం ఉందని కొందరు.లేదు శానంపూడి సైదిరెడ్డి మళ్లీ పోటీకి నిలిచే అవకాశం ఉందంటున్నారు.కాని కాంగ్రెస్‌ క్యాండిడేట్‌ మహిళ కనుక టీఆర్‌ఎస్‌ కూడా మహిళ అయితే బాగుంటుందని భావిస్తున్నారు.అందుకే టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం కవితను రంగంలోకి దించే అవకాశం ఉందనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube