కవితమ్మ డైలాగ్స్ ! చేతగాని కాంగ్రెస్ ... వెకిలి చేష్టల రేవంత్ 

బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ( CM kcr )పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల లిస్టును ప్రకటించిన తర్వాత, తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి.ముఖ్యంగా కేసిఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేసుకుని విపక్షాలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి.

 Kavitamma Dialogues Chetagani Congress Revant, Brs, Telangana Cm, Kcr, Kavitha-TeluguStop.com

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ ఢిల్లీలో కవిత చేపట్టిన దీక్షను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.బీఆర్ఎస్ మొదటి విడత జాబితాలో 33% రిజర్వేషన్ ఎక్కడ అంటూ కవితను విపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఈ విమర్శలపై తాజాగా కవిత ( Kavitha )సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

Telugu Brs, Brs Mla Tickets, Kavitha, Telangana Cm-Politics

’60 ఏళ్ల తమ పాలనలో అసెంబ్లీ,  పార్లమెంట్ లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించలేని చేతకాని కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి.పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు మహిళా బిల్లు పై వారి అధిష్టానాన్ని ఏ ఒక్క రోజైనా నిలదీశారా ? మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని గత పదేళ్లలో గౌరవ సోనియా గాంధీ,  శ్రీమతి ప్రియాంక గాంధీ ( Priyanka Gandhi ), గాంధీ భవన్ గాడ్సే అయిన రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలేదు ? ఉత్తర ప్రదేశ్ నేతలు కేటాయించారు అన్నది గుర్తుంచుకోవాలి.గెలిచిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు 15 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే , ముగ్గురు గెలవగా 18 మంది మంత్రుల్లో కేవలం ఒక్క మహిళకే అవకాశం ఇచ్చింది.

తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు నీతులు చెబుతున్నారు.

Telugu Brs, Brs Mla Tickets, Kavitha, Telangana Cm-Politics

తన స్వార్థపూరిత రాజకీయాల కోసం మహిళా రిజర్వేషన్ బిల్లును దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ( Congress party ) వాడుతుంది.మహిళా రిజర్వేషన్లపై చట్టం చేయాలని మా డిమాండ్ ను కూడా వెకిలిగా మాట్లాడడం రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యం.ఏ పార్టీ అయినా,  ఏ రాష్ట్రం అయినా మహిళలకు దక్కాల్సిన అన్ని స్థానాలు దక్కడం లేదనేదే మహిళల ఆవేదన.

రాజ్యాంగపరంగానే మహిళల హక్కులు అమలు కావాలి.దానికి చిత్తశుద్ధితో అన్ని పార్టీలు కలిసి రావాలి.

నేను ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ల కోసం ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అధికారికంగా ఆహ్వానం పంపాను.కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క ప్రతినిధి కూడా హాజరు కాలేదు.

కనీసం పత్రిక ప్రకటన కూడా చేయలేదు అంటూ కవిత ‘ ఫైర్ అయ్యారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube