కౌశిక్ ఒంటరి ' రాజకీయం ' ? ఎన్నో అనుమానాలు ?

ప్రస్తుతం హుజురాబాద్ ఎన్నికల తంతు రసవత్తరంగా మారింది.టిఆర్ఎస్, బిజెపి ,కాంగ్రెస్ మధ్య నువ్వానేనా అన్నట్లు గా పోటీ వాతావరణం నెలకొంది.

 Kaushik Reddy Trs Suspicion On Huzurabad Politics Koushik Reddy, Trs, Kcr, Telan-TeluguStop.com

ఇంకా ఎన్నికల తేదీ ప్రకటించినా, అప్పుడే ఎన్నికల వచ్చినట్లు అన్ని పార్టీలు హడావుడి చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ టిఆర్ఎస్ ఈ విషయంలో కాస్త ఎక్కువ టెన్షన్ పడుతోంది .హుజురాబాద్ ను మళ్లీ దక్కించుకోవాలని కసిగా ఉంది.దీనిలో భాగంగానే కాంగ్రెస్ లో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి నీ టిఆర్ఎస్ లో చేర్చుకొని ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు ప్రకటించింది.

అయితే గవర్నర్ కార్యాలయం వద్ద ఇంకా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఫైల్ పెండింగ్ లో ఉండటంతో ఆయన అధికారికంగా ఎమ్మెల్సీగా నియమించబడ లేదు.

      అయితే కౌశిక్ రెడ్డి పై అనేక కేసులు ఉండటంతోనే ఈ ఫైల్ పెండింగ్ లో పెట్టారు అని ఒకవైపు జరుగుతుండగా, కౌశిక్ రెడ్డి ఇప్పుడు హుజురాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఉండడం,  ఒంటరిగానే ఆయన వ్యవహారాలు చేస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

టిఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించినప్పటికీ ఎక్కడా ఆయనను కలుపు కు వెళ్లకుండా, ఒంటరిగానే గ్రామాల్లో కౌశిక్ రెడ్డి తిరుగుతున్నారు.మంత్రి హరీష్ రావు హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన తర్వాత కౌశిక్ రెడ్డి గ్రామాల్లో తిరుగుతూ ప్రజలతో భేటీ అవుతూ ఉండటం చర్చనీయాంశం గా మారింది.
   

Telugu Etela Rajendar, Gellusrinivas, Huzurabad, Koushik Reddy, Telangana-Telugu

   అయితే ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించాలి అనుకుంటే టిఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ ను వెంట పెట్టుకోవాలి.కానీ ఈ విధంగా పార్టీ పెద్దలకు సమాచారం లేకుండానే ఈ విధమైన వ్యవహారం  చేస్తున్న తీరును టిఆర్ఎస్ నేతలు తప్పు పడుతున్నారు.అయితే సొంతంగానే కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం గ్రామాల్లో తిరుగుతున్నారా లేక కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన తర్వాత  ఏ విధమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారా అనేది అంతు పట్టడం లేదు. కౌశిక్ రెడ్డి వ్యవహారం పై టీఆర్ఎస్ కూడా సీక్రెట్ గానే ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా ఎన్నికల తంతు ముగిసే వరకు ప్రతి ఒక్కరిపైన టీఆర్ఎస్  ప్రత్యేక నిఘా పెట్టినట్టుగా సమాచారం. 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube