కౌశిక్‌రెడ్డి మ‌రో ఫోన్ కాల్ లీక్‌.. ఈసారి మ‌రింత వివాదంలోకి..!

ప్ర‌స్తుత హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా కౌశిక్‌రెడ్డి పోటీ చేస్తార‌ని మొన్న‌టి దాకా ప్ర‌చారం జ‌రిగింది.ఆయ‌న కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ఏకంగా ప్ర‌చారం కూడా మొద‌లు పెట్టాడు.

 Kaushik Reddy Leaks Another Phone Call  This Time Into More Controversy ..!, Rev-TeluguStop.com

కానీ అనూహ్యంగా రేవంత్‌కు పీసీసీ రావ‌డంతో ఈ పోటీ మ‌రింత గ‌ట్టిగానే ఉంటుంద‌ని అంతా అనుకున్నారు.కానీ ఊహించ‌ని విధంగా రీసెంట్‌గా కౌశిక్‌రెడ్డి ఆడియో లీక్ కావ‌డం, అందులో ఆయ‌న‌కు టీఆర్ ఎస్ టికెట్ వ‌చ్చింద‌ని ఆయ‌న చెప్ప‌డంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా దీన్ని సీరియ‌స్‌గానే తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక త‌న‌పై వారు యాక్ష‌న్ తీసుకునేలోపే ప్లాన్ ప్ర‌కారం కౌశిక్‌రెడ్డి రాజీనామా చేశారు.ఇక ఆయ‌న ఎలాగూ టీఆర్ ఎస్‌లో చేరేలాగే క‌నిపిస్తున్నారు.అయితే ఈ క్రమంలోనే ఇప్పుడు మ‌రో ఆడియో లీక్ బ‌య‌ట‌కు రావ‌డంతో ఆయ‌న మరింత వివాదంలో ఇర‌క్కున్న‌ట్టు తెలుస్తోంది.పార్టీకి రాజీనామా చేసిన త‌ర్వాత కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ మండలం కొత్తపల్లికి కాంగ్రెస్ లీడ‌ర్ అయిన తిరుపతికి ఫోన్ చేసి త‌న రాజీనామా విష‌య‌మై చాలా సేపు మాట్లాడారు.

ఇందులో త‌న తప్పు ఏమాత్రం లేద‌ని, త‌న‌కు అండ‌గా నిల‌వాల‌ని కాంగ్రెస్ నేత‌ల‌ను కోరుతున్నారు కౌశిక్‌.

Telugu @revanth_anumula, Leak, Huzurabad, Koushik, Revanth Reddy, Ts Congress, T

అయితే ఈ ఆడియోలో మిగ‌తా టీఆర్ ఎస్ , బీజేపీ ఇన్ చార్జుల‌ను నియ‌మించి జోరుగా ప్ర‌చారం చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం అవేమీ చేయ‌కుండా క‌నీసం త‌న‌ను అభ్యర్థిగా ప్రకటించకుండా ఉండ‌డంతోనే ఇలా చేయాల్సి వచ్చిందని కౌశిక్ రెడ్డి త‌న ఆవేద‌న‌ను తిరుప‌తితో వ్య‌క్తం చేశాడు.ఇప్ప‌టి దాకా తాను ఎంతో కష్టపడ్డామని కానీ ఇక మీద‌ట తాను సుఖపడే రోజులు వ‌చ్చాయ‌ని చెప్ప‌డం ఇక్క‌డ అనేక సందేహాలకు తావిస్తోంది.ఆయ‌న‌కు నిజంగానే టీఆర్ ఎస్ టికెట్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు తెలుస్తోంది.

ఇక రేవంత్‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కౌశిక్‌.

Telugu @revanth_anumula, Leak, Huzurabad, Koushik, Revanth Reddy, Ts Congress, T

కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న‌ రేవంత్ రెడ్డి హుజూరాబాద్‌లో ఓడిపోతామ‌ని చెబుతుంటే తానెలా పోటీచేయాలి అటూ ప్ర‌శ్నించారు.అంతే కాదు సాక్ష్యాత్తు పోటీని మ‌రింత పెంచాల్సిన రేవంత్ రెడ్డి అలా అన్న‌ప్పుడు అస‌లు పోటీ ఏమైనా ఉంటుందా అంటూ ప్ర‌శ్నించారు కౌశిక్‌.నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీతో పాటు టీఆర్ఎస్ నేతలు నిత్యం తిరుగుతున్నార‌ని, కానీ తాను ఎన్నిసార్లు అడిగినా కూడా ఇన్ చార్జుల‌ను నియ‌మించ‌లేద‌ని వ‌వాపోయారు కౌశిక్‌.

మొత్తానికి రెండో ఆడియోలో కూడా రేవంత్‌పైనే బాణాలు సంధిస్తూ త‌న‌ను సేవ్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు కౌశిక్‌.అయితే ఈ వ్యాఖ్య‌లు ఆయ‌న్ను కాంగ్రెస్ పార్టీకి మ‌రింత దూరం చేశాయ‌ని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube