బాబు గోగినేనికి బిగ్‌ బాస్‌ టైటిల్‌ మరియు ప్రైజ్‌ మనీ ఇస్తానన్న కౌశల్‌     2018-10-05   11:23:01  IST  Ramesh P

బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 టైటిల్‌ విజేత కౌశల్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు వచ్చిన బిగ్‌ బాస్‌ టైటిల్‌ మరియు ప్రైజ్‌మనీని బాబు గోగినేనికి ఇచ్చేందుకు సిద్దం అంటూ ప్రకటించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… గత కొన్ని రోజులుగా బాబు గోగినేని తీవ్ర స్థాయిలో కౌశల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. కౌశల్‌ ఆర్మీ ఒక ఫేక్‌ అంటూ డబ్బులు ఇచ్చి ఓట్లను పొందిన కౌశల్‌తో పాటు బిగ్‌ బాస్‌ కూడా సరైన ఆటను ఆడలేదు అంటూ పెద్ద ఆర్టికల్‌ను బాబు గోగినేని రాసిన విషయం తెల్సిందే.

బాబు గోగినేని రాసిన సదరు ఆర్టికల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దాంతో కౌశల్‌ ఆర్మీ సభ్యులు పెద్ద ఎత్తున ఆయనపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా కౌశల్‌ కూడా బాబు గోగినేని విమర్శలపై స్పందించాడు. డబ్బులు ఇచ్చి ఓట్లు పొందవచ్చు అనే విషయం తెల్సిందే. ఆ విషయం తెలిసిన బాబు గారు అన్ని వారాలు డబ్బులు ఇచ్చి ఓట్లు పొంది ఉండి ఉంటారు అంటూ కౌశల్‌ అన్నాడు. తాను డబ్బులు ఇచ్చి ఓట్లు పొంది బిగ్‌ బాస్‌ నెగ్గినట్లుగా నిరూపిస్తే టైటిల్‌ మరియు ప్రైజ్‌ మనీని బాబు గోగినేనికి ఇచ్చేస్తాను అంటూ ప్రకటించాడు.

కౌశల్‌ ఆర్మీ గురించి కూడా బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. గొర్రెల మందలా వ్యవహరిస్తున్నారు. కొందరు చేస్తున్న విమర్శలు మరీ చెత్తగా ఉన్నాయి అంటూ ఆయన ఆరోపించాడు. దాంతో కౌశల్‌ మాట్లాడుతూ తన అభిమానులను అంటే మాత్రం ఊరుకునేది లేదని, తన అభిమానులను ఏమైనా అంటే ఎక్కడి వరకైనా వెళ్లేందుకు సిద్దం అంటూ బాబు గోగినేనిని కౌశల్‌ హెచ్చరించాడు. బాబు గోగినేని వర్సెస్‌ కౌశల్‌ వివాదం ఇప్పట్లో తేలేలా లేదు అంటూ టాక్‌ వినిపిస్తుంది.