కౌశల్‌ చేస్తున్న వ్యాఖ్యలు విమర్శల పాలవుతున్నాయి  

Kaushal Talks Making Angry To The Fans-

బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 విన్నర్‌ కౌశల్‌కు అనూహ్యంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిన విషయం తెల్సిందే. కౌశల్‌ ముక్కుసూటితనం మరియు ఆట ఆడిన తీరు పట్ల ఎంతో మంది ఇంప్రెస్‌ అయ్యి, ఆయన్ను అభిమానించారు. అలా అభిమానించే వారు కౌశల్‌ ఆర్మీగా ఫాం అయ్యారు. కౌశల్‌ ఆర్మీ ఏ రేంజ్‌లో బిగ్‌బాస్‌ను నడిపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..

కౌశల్‌ చేస్తున్న వ్యాఖ్యలు విమర్శల పాలవుతున్నాయి-Kaushal Talks Making Angry To The Fans

కౌశల్‌ ఆర్మీ ఏం చెబితే అదే అన్నట్లుగా బిగ్‌బాస్‌ సాగింది. ఎవరు వెళ్లి పోవాలనుకుంటే వారిని కౌశల్‌ ఆర్మీ సాగనంపింది. ఇంతటి గొప్ప ఆర్మీని దక్కించుకున్న కౌశల్‌ బయటకు వచ్చిన తర్వాత చేస్తున్న వ్యాఖ్యలు విమర్శల పాలు అవుతున్నాయి.

కౌశల్‌ బయటకు వచ్చిన తర్వాత కూడా తన గొప్పతనంను చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. తానో హీరోను అయ్యాను, మిగిలిన వారిని తొక్కేసి నేను టాప్‌ స్టార్‌ అయ్యాను అంటూ కౌశల్‌ భావిస్తున్నాడు. ఈమద్య పలు ఇంటర్వ్యూలో ఆయన ఇలాగే మాట్లాడుతూ ఉన్నాడు. కౌశల్‌ చేస్తున్న వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్నారు.

కౌశల్‌ ఆర్మీ మెంబర్స్‌ కూడా కొందరు కౌశల్‌ అతిపై ఆగ్రహంగా ఉన్నారు. .

ఇంతకు కౌశల్‌ ఏమన్నాడంటే… నేను బయటకు వచ్చిన తర్వాత ఏ ఒక్క పార్టిసిపెంట్‌ కూడా ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలపలేదు. మారుతి, బోయపాటితో పాటు ఇంకా పలువురు సినీ ప్రముఖులు నాకు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. గిన్నీస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు వారు నాకు ఫోన్‌ చేశారు.

త్వరలోనే ఒక రికార్డు నాకు ఇవ్వబోతున్నారు. దాంతో పాటు అమెరికాకు చెందిన ఒక యూనివర్శిటీ వారు నాకు గౌరవ డాక్టరేట్‌ ఇచ్చేందుకు సిద్దం అయ్యారు. త్వరలోనే ఆ విషయాన్ని కూడా వెళ్లడిస్తాను.

నన్ను హీరోగా చేయమంటూ చాలా మంది అడుగుతున్నారు, తప్పకుండా హీరోగా చేస్తాను, ఇలా కౌశల్‌ చేస్తున్న కామెంట్స్‌ నమ్మశక్యంగా లేవని అంటున్నారు.

తాజాగా ప్రధానమంత్రి కార్యాలయం నుండి నాకు కాల్‌ వచ్చింది. నేను బిగ్‌బాస్‌ సీజన్‌ 2 విన్నర్‌గా నిలిచినందుకు వారి నుండి అభినందనలు దక్కాయి. నా కాల్‌ను మా నాన్న గారు రిసీవ్‌ చేసుకున్నారు అంటూ కౌశల్‌ పేర్కొన్నాడు. మొత్తానికి కౌశల్‌ చేస్తున్న అతి కామెంట్స్‌ కారణంగా అభిమానులను కోల్పోయి, విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని సోషల్‌ మీడియాలో కొందరు కౌశల్‌ను హెచ్చరిస్తున్నారు.