బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ పై మళ్ళీ ట్రోలింగ్.. కారణం?

వెండితెర, బుల్లితెర నటుడు కౌశల్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Kaushal Manda Gets Trolling For His New Movie Heroine, Kaushal Manda, Trolling,-TeluguStop.com

ఇక బుల్లితెరలో పలు సీరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు.బుల్లితెరలో డాన్స్ బేబీ డాన్స్ షో హోస్టింగ్ గా కూడా చేశాడు.

ఇక రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొని టైటిల్ విన్నర్ గా నిలిచాడు.ఇదిలా ఉంటే తాజాగా ఈయనపై తెగ ట్రోలింగ్స్ ఎదురవుతున్నాయి.

వెండితెరపై పలు సినిమాలలో సహాయ పాత్రలలో నటించాడు.బిగ్ బాస్ లో అడుగు పెట్టి తన గేమ్ ఏంటో ఆడి మంచి అభిమానులను సొంతం చేసుకున్నాడు.కానీ టైటిల్ విన్నర్ తర్వాత కాంట్రవర్సీ ఎదుర్కొన్నాడు.అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా తను చేసే పోస్ట్ లకు కూడా బాగా ట్రోలింగ్స్ ఎదుర్కొంటాడు.

ఇదిలా ఉంటే ఈ మధ్య వరస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉన్నాడు.ఒకేసారి మూడు సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.ఇక అందులో రైట్ అనే సినిమా ప్రకటించగా.తాజాగా ఆ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.అందులో హీరోయిన్ ఎవరు అని తెలుపగా.ఆమెను కేవలం వెనకాలనుంచి మాత్రమే చూపించాడు.

దీంతో ఈ హీరోయిన్ ఎవరో చెప్పుకోండి అంటూ అభిమానులను ప్రశ్నించగా.దీంతో ఈ ప్రశ్నకు తెగ ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్నాడు కౌశల్.కొందరు తేజస్వి కదా అన్ని ఫన్నీ కామెంట్లు చేశారు.ఇక మరికొందరు ఓహో తమన్నా సింహాద్రినేమో అంటూ హేళన చేశారు.మరికొందరు అవికా గోర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి నెటిజన్లు కౌశల్ ను ఓ రేంజ్ లో ఆట ఆటాడుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube