గంగవ్వకి సపోర్ట్ చేస్తున్న బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో స్పెషల్ ఎట్రాక్షన్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వ్యక్తి సోషల్ మీడియా సెన్సేషన్ గంగవ్వ.మై విలేజ్ షో ద్వారా పాపులర్ అయిన గంగవ్వకి ఇప్పటి వరకు వచ్చిన ఫేమ్ బిగ్ బాస్ లో భాగా హెల్ప్ అవుతుంది.

 Kaushal Manda Comments On Gangavva Entry, Tollywood, Bigg Boss Season 4, Star Ma-TeluguStop.com

ఆమె కోసమే బిగ్ బాస్ షో చూస్తున్నవారు ప్రస్తుతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు.తనకి వచ్చిన ఆ గుర్తింపుని గంగవ్వ కూడా ఆశ్వాదిస్తుంది.

ఇప్పటికే సోషల్ మీడియాలో గంగవ్వకి విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది.హౌస్ లో ఆమె ఏం చేసిన వైరల్ అవుతుంది.

ఓ విధంగా గంగవ్వ బిగ్ బాస్ ఫైనల్ స్టేజ్ కి వచ్చిన కూడా ఎవరూ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.ఎందుకంటే ఆమె మాఫియా ఆ విధంగా ఉంది.

అలాగే గంగవ్వ కారణంగా బిగ్ బాస్ షోకి కూడా హైప్ వస్తూ ఉండటంతో ఆమెని ఇప్పట్లో బయటకి పంపించే ప్రయత్నాలు చేసే అవకాశం ఉండదు.తన తెలంగాణ పల్లెటూరి మాండలికంతో ఆమె షోలో సందడి క్రియేట్ చేస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సీజన్ లో గంగవ్వ పది వారాల పాటు హౌస్ లో ఉండే అవకాశం ఉందని బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ మండా చెప్పుకొచ్చారు.ఈ సీజన్ బిగ్ బాస్ గురించి తన అభిప్రాయాలు పంచుకున్న కౌశల్ గంగ‌వ్వ‌ను ఎంపిక చేయ‌డం మాత్రం విశేష‌మ‌ని కౌశ‌ల్ వ్యాఖ్యానించాడు.

నిజానికి ఆమె వ‌య‌సు వ‌చ్చేస‌రికి అంద‌రం ప‌ని నుంచి రిటైర్‌మెంట్ తీసుకోవాల‌ని చూస్తాం, కానీ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఓ సాధార‌ణ‌ ప‌ల్లెటూరు నుంచి ఓ బామ్మ బిగ్‌బాస్ షోలో పాల్గొన‌డం అసాధార‌ణం అని కౌశల్ చెప్పుకొచ్చాడు.ఆమె ప్ర‌తి ఒక్క‌రికీ ఆద‌ర్శ‌ప్రాయ‌మ‌ని పేర్కొన్నాడు.

ప‌ల్లెల్లో బిగ్‌బాస్ చూసేవారి సంఖ్య‌ను పెంచాల‌నే ఉద్దేశంతోనే ఆమెను తీసుకొచ్చార‌నేది తన అభిప్రాయమని తెలిపాడు.కేవ‌లం ఫిజిక‌ల్ టాస్క్‌ల ద్వారానే కంటెస్టెంట్లు ఫైన‌ల్‌కు చేరుకుంటార‌ని నేను అనుకోవ‌ట్లేదు.

ఎందుకంటే రెండో సీజ‌న్‌లో ‌గీతామాధురి ఫిజిక‌ల్ టాస్క్‌లో పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌క‌పోయిన‌ప్ప‌టికీ ఫైన‌ల్‌కు చేరుకుంది.ఈ లెక్క‌న గంగ‌వ్వ 10 వారాల క‌న్నా ఎక్కువే హౌస్‌లో ఉండే అవ‌కాశం ఉందని కౌశల్ తన అభిప్రాయం తెలిపారు.

అలాగే మిగిలిన ఇంటి సభ్యులలో కొందరి గురించి తన అభిప్రాయాలు కౌశల్ పంచుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube