కౌశల్‌ ఆర్మీ గురించి బిగ్‌ బాస్‌ విజేత కౌశల్‌ ఏమన్నాడో తెలుసా?

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 విజేతగా కౌశల్‌ నిలిచాడు.ఈ సీజన్‌ ఆరంభం నుండి కౌశల్‌ తనదైన రీతిలో ముందుకు దూసుకు పోతూనే ఉన్నాడు.

 Kaushal Literally Gets Emotional On About Kaushal Army-TeluguStop.com

తన నిజాయితీతో, తాను అనుకున్నదాని కోసం నిబడే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అవ్వడంతో కౌశల్‌కు అనూహ్యంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది.కౌశల్‌ ఆర్మీ పెద్ద ఎత్తున ఫామ్‌ అయ్యింది.

కౌశల్‌ ఆర్మీ మొత్తం ఈ సీజన్‌ను నడిపించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.కౌశల్‌ ఆర్మీ ఏ రేంజ్‌లో ప్రమోషన్స్‌ చేసి కౌశల్‌కు ఓట్లు వేసేలా చేశారో అందరికి తెల్సిందే.

ఇన్నాళ్లు బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఉన్న కౌశల్‌ కు బయట ఉన్న కౌశల్‌ ఆర్మీ గురించి తెలియదు.కౌశల్‌ ఆర్మీ అనేది ఉంది అని మాత్రమే తెలుసు కాని ఈ స్థాయిలో ఉందని కౌశల్‌ ఖచ్చితంగా ఊహించి ఉండడు.కౌశల్‌ గురించి పెద్ద ఎత్తున అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో కౌశల్‌ విజేతగా నిలిచిన తర్వాత, కౌశల్‌ ఆర్మీ గురించి ఎలా మాట్లాడతాడు, ఎలా స్పందిస్తాడు అంటూ అంతా అనుకున్నారు.

కౌశల్‌ తన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు, ప్రతి ఒక్కరికి పాదాభివందం అంటూ చెప్పుకొచ్చాడు.

అన్నపూర్ణ స్టూడియో ముందు కౌశల్‌ ఆర్మీ చేసిన సందడి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో రచ్చ అవుతుంది.కౌశల్‌కు గ్రాండ్‌ వెల్‌కం పలకడంతో పాటు రికార్డు స్థాయిలో బాణా సంచా కాలుస్తూ కౌశల్‌ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు.తన అభిమానులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పిన కౌశల్‌ తనకు వచ్చిన బిగ్‌ బాస్‌ టైటిల్‌ను తనకోసం నిలిచిన ప్రతి ఒక్కరికి అంకితం ఇస్తున్నట్లుగా ప్రకటించింది.

తన తల్లి జన్మను ఇస్తే కౌశల్‌ ఆర్మీ పునర్‌జన్మను ఇచ్చింది అంటూ కౌశల్‌ ఎమోషన్‌ అయ్యాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube