బిగ్ బాస్ సీజన్-1 లో అవకాశమొచ్చినా కౌశల్ ఎందుకు వదులుకున్నాడు.? ఆ ఇద్దరు అంటే కోపమంట .!  

Kaushal Fire On Tejaswini And Babu Gogineni-

బిగ్‌బాస్ తెలుగు 2 సీజన్ ముగిసింది. ఎన్నో అటంకాలను, ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొని విజేతగా కౌశల్ నిలిచారు. బిగ్‌బాస్‌లో ఉండగా బయట నుంచి కౌశల్ ఆర్మీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. దాంతో ఆయన సులభంగా పలు ఎలిమినేషన్ల గురించి బయటపడ్డారు...

బిగ్ బాస్ సీజన్-1 లో అవకాశమొచ్చినా కౌశల్ ఎందుకు వదులుకున్నాడు.? ఆ ఇద్దరు అంటే కోపమంట .!-Kaushal Fire On Tejaswini And Babu Gogineni

అయితే గతంలో కౌశల్ ఆర్మీ పై బాబు గోగినేని గారు సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. కౌశల్ ఆర్మీ పెయిడ్ అని అన్నారు.ఇప్పటికే కౌశల్ ఆర్మీ ఆ విషయమై బాబుపై కౌంటర్ పేల్చేశారు.

తాజాగా కౌశల్ కూడా ఓ ఇంటర్వ్యూలో ఆయనపై వెటకారంగా కామెంట్స్ చేసారు.

అంతేకాదు కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. బిగ్‌బాస్ తొలి సీజన్లో పాల్గొనే అవకాశం నాకొచ్చింది. కానీ సూర్యవంశం సీరియల్ కోసం ఏడాదిపాటు కమిట్‌మెంట్ ఉండటంతో పార్టిసిపేట్ చేయడం కుదరలేదని కౌశల్ తెలిపాడు.

రెండో సీజన్ కోసం రాత్రి పగలు కష్టపడి కమిట్‌మెంట్స్ పూర్తి చేయాల్సి వచ్చిందని టైటిల్ విజేత చెప్పాడు. బిగ్‌బాస్ గేమ్ కోసం, టైటిల్ గెలవడం కోసం నేను కన్నింగే అని కౌశల్ చెప్పుకొచ్చాడు...

బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌లో తేజస్వి, బాబు గోగొనేనిపై తనకు చాలా కోపంగా ఉందని కౌశల్ చెప్పాడు.

ఓ బ్రదర్‌లా షేర్ చేసుకున్న విషయాలను బాబు బయటపెట్టడం బాధించిందని చెప్పాడు. కౌశల్ లెవల్ ఏంటని బాబు మాట్లాడారు. నాలుగో వారం వరకు నేను తనతో చాలా క్లోజ్‌గా ఉన్నానని కౌశల్ తెలిపాడు.

ఓసారి నేను భోజనం చేస్తుంటే. సిగ్గులేకుండా తింటున్నావని తేజస్వి అనేసింది.

చాలాసార్లు తప్పుడు మాటలు మాట్లాడింది. ఆమె మాట్లాడిన మాటలు టెలికాస్ట్ అయ్యాయో లేదో తెలీదని కౌశల్ చెప్పాడు.