కౌశల్‌ ఇదేం పద్దతి.. ఇలాంటి పబ్లిసిటీ అవసరమా?

బిగ్‌ బాస్‌ విన్నర్‌ కౌశల్‌ గత కొన్ని రోజులుగా ఏదో ఒక వివాదంతో మీడియాలో ఉంటూనే ఉన్నాడు.ఆయన చేసిన, చేస్తున్న పనులు కొన్ని విమర్శలకు తావు ఇస్తున్నాయి.

 Kaushal Cheapest Publicity Stunts-TeluguStop.com

కౌశల్‌ ఆర్మీ ఫౌండేషన్‌ ద్వారా ఆయన నిధులు సేకరించి వాటిని దుర్వినియోగం చేస్తున్నాడు అంటూ కొందరు ఆరోపించారు.ఆ ఆరోపణలకు సరైన సాక్ష్యాలు లేవని, తాను ఎంత డబ్బు ఎలా ఖర్చు చేశానో పూర్తి లెక్కలతో సహా వివరిస్తాను అంటూ కౌశల్‌ మీడియా ముందుకు వచ్చి చెప్పుకొచ్చాడు.

కౌశల్‌ ఎంత చేసినా ఏం చేసినా కూడా పబ్లిసిటీ కోసం చేస్తున్నట్లుగా అంతా ఆరోపిస్తున్నారు.

ఇటీవల కౌశల్‌ తన భార్యకు క్యాన్సర్‌ ఉందని, ఆమె చికిత్స చేయించుకోకుండా నా వెంట తిరుగుతుంది అంటూ చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే.

ఆ విషయంను కొంత మంది అబద్దం అంటూ విమర్శించారు.కౌశల్‌ సానుభూతి కోసం ఇలా చెప్పాడు అని కొందరు విమర్శలు చేశారు.అయితే తాజాగా కూడా తన భార్యకు ఆపరేషన్‌ అవుతుందని, ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్‌ చేశాడు.ఆ పోస్ట్‌ ను కూడా చాలా మంది అనుమానించారు.

నీలిమా ఆరోగ్యంగా ఉన్నా కూడా ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటూ ఆరోపించారు.

తాజాగా మరోసారి కౌశల్‌ సోషల్‌ మీడియా ద్వారా జనాల ముందుకు వచ్చాడు.ఈసారి ఆయన తన భార్య నీలిమ బెడ్‌ పై మెలుకువ లేకుండా ఉండగా పక్కన కూర్చుని వీడియో చేశాడు.తన భార్య నీలిమ ఆపరేషన్‌ పూర్తి అయ్యింది.

ప్రతి ఒక్కరు కూడా చాలా మద్దతుగా నిలిచారు.ఎంతో మంది నీలిమా బాగుండాలని కోరుకుంటూ మొక్కులు తీర్చుకోవడంతో పాటు, నాకు మెసేజ్‌లు పెట్టారు.

వారందరికి కూడా కృతజ్ఞతలు.ప్రస్తుతం నీలిమా ఆరోగ్యం బాగానే ఉందని, ఆమె తప్పకుండా త్వరలోనే కోలుకుంటుందని చెప్పాడు.

అయితే దీన్ని కూడా కొందరు తప్పుబడుతున్నారు.ఇలాంటి వీడియోలు కౌశల్‌ పబ్లిసిటీ కోసమే చేస్తున్నాడు అంటూ ఆరోపిస్తున్నారు.

మరి కొందరు మాత్రం నీలిమా త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్స్‌ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube