'బయటకివస్తే చూసుకుందాం అన్నాడు...కానీ ఇప్పుడు.?' తనీష్ పై కౌశల్ సంచలన కామెంట్స్.!     2018-10-07   10:50:39  IST  Sainath G

బిగ్‌బాస్ తెలుగు 2 సీజన్ ముగిసింది. ఎన్నో అటంకాలను, ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొని విజేతగా కౌశల్ నిలిచారు. బిగ్‌బాస్‌లో ఉండగా బయట నుంచి కౌశల్ ఆర్మీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. దాంతో ఆయన సులభంగా పలు ఎలిమినేషన్ల గురించి బయటపడ్డారు. వెంకటేష్ గారి చేతులమీదుగా 50 లక్షల రూపాయల చెక్ అందుకున్నారు విన్నర్ కౌశల్. ఈ షో ద్వారా ఆయనకి ఎంత క్రేజ్ వచ్చిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. హౌస్ మేట్స్ తో ఒంటరి పోరాటం చేయడంతో అభిమానులంతా కలిసి ఆర్మీ లాగ ఏర్పడ్డారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కౌశల్ తన అనుభవాలను పంచుకున్నాడు.

అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించాడు అని తనపై వచ్చిన నిందలపై క్లారిటీ ఇచ్చాడు. అలాగే షో చివరి దశలో ఓ సారి తనీష్ బయటకి రా చూసుకుందాము అని వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఆ విషయంపై కూడా స్పందించారు కౌశల్. కేవలం ఒక అమ్మాయి చేయి పట్టుకుంటేనే నన్ను ‘ప్లే బాయ్’ అని అంటే.. హౌస్‌లో మిగతావాళ్లు హగ్గులు, కిస్సులు పెట్టుకున్నారు. ఒకళ్ల మీద ఒకళ్లు కూర్చోడాలు చేశారు.. వాళ్లను ఏమనాలి..?..’ అని కౌశల్ ప్రశ్నిస్తున్నారు.

‘బయటికొచ్చాక నీ సంగతి చూస్తా.. కొట్టేస్తా’.. అని తనీష్ అన్నారు
బిగ్‌బాస్ తర్వాత హౌస్‌మేట్స్‌లో ఒక్కరు కూడా నాకు ఫోన్ చేయరని చెప్పా..
రెండో వారంలో నా భార్యపై వచ్చిన ట్రోల్స్ చూస్తే షాకవుతారు
నా గతం గురించి, గర్ల్‌ఫ్రెండ్‌ల గురించి నా భార్యకు ఎప్పుడో చెప్పేశా. ప్రపంచంలో ఏ రియాలిటీ షోకు, ఏ కంటెస్టెంట్‌కు రానన్ని ఓట్లు నాకు వచ్చాయి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 కోట్ల ఓట్లు.. మొన్న కోన వెంకట్ గారు ఒక మాట అన్నారు. కౌశల్ ఆర్మీ సభ్యులు ఒక సినిమా చూస్తే చాలు.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని..’ అంటూ కౌశల్ వివరించారు.

ఇతర కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతూ..వాళ్ల గొయ్యి వాళ్లు తవ్వుకున్నారు కానీ.. దీంట్లో తాను చేసిందేమీ లేదని ఆయన అంటున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో కౌశల్ ఒంటరి అయిపోవడం చూసి ప్రతిరోజూ తాను ఏడుస్తూ ఉంటానని ఆయన భార్య నీలిమ ఆవేదన వ్యక్తం చేశారు. ‘పెళ్లికి ముందు ఏమో తెలీదు కానీ.. నా దగ్గరకు వచ్చాక మాత్రం ఈ బంగారం మంచిదే..’ అంటూ కౌశల్ గురించి వివరించారామె. ఆయన తన గతం గురించి, గర్ల్‌ఫ్రెండ్‌ల గురించి అంతా చెప్పారంటున్నారామె. ఆయనకు మాతో గడపడానికే సమయం ఉండదని, ఇక ఇతర చెడు అలవాట్లేమి ఉంటాయని ప్రశ్నిస్తున్నారు.