కత్తి మహేష్ లేనిలోటు స్పష్టంగా కనిపిస్తుంది.. పృథ్వి రాజ్ షాకింగ్ కామెంట్స్?

Katti Maheshs Absence Is Obvious Prithviraj Shocking Comments

సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్ మరణించిన సంగతి అందరికీ తెలిసిందే.తాను బ్రతికున్నంతకాలం బాగా విమర్శలు చేసి విమర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు.

 Katti Maheshs Absence Is Obvious Prithviraj Shocking Comments-TeluguStop.com

ఈయన మరణం తర్వాత సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఆయన మరణానికి సంతాపం తెలిపారు.ఇదిలా ఉంటే తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పృథ్వి రాజ్ కూడా కత్తి మహేష్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీరాజ్ కొన్ని విషయాలు పంచుకున్నాడు.కత్తి మహేష్ లేని లోటు తెలుస్తుందని జర్నలిజంలో కానీ క్రిటిక్ గా కానీ తను చేసిన విమర్శలు అర్థవంతంగా ఉంటాయని తాను ఎంచుకున్నదే కరెక్ట్ అని అనేవాడని తెలిపాడు.

 Katti Maheshs Absence Is Obvious Prithviraj Shocking Comments-కత్తి మహేష్ లేనిలోటు స్పష్టంగా కనిపిస్తుంది.. పృథ్వి రాజ్ షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తను ఎప్పుడైనా మీపై ట్రోల్ చేస్తున్నారు ఇవన్నీ ఎందుకని ప్రశ్నించినప్పుడు యుద్ధంలోకి దిగాం అంటూ కత్తితో పోరాడుతున్నాం అని అనేవాడని తెలిపాడు.

ఇక తన రూమ్ కి వచ్చే వాడని చాలా మంచి వ్యక్తి అని కత్తి మహేష్ గురించి పొగిడాడు పృథ్వి రాజ్.

ఇక ఆయన ఇప్పుడు ఉన్నట్లయితే కథ వేరేలా ఉంటుందని వెబ్ సిరీస్ లతో పాటు ఓటీటీ కంటెంట్, చిన్న చిన్న సినిమాలు వరుస ప్రాజెక్టులో ఉన్నాయని కానీ తాను చనిపోవడం చాలా బాధాకరమని తెలిపాడు.తనపై ఎన్ని వివాదాలు ఉన్న కూడా ధైర్యంగా, ఒంటరిగా ఉండేవాడని తెలిపాడు.

Telugu Katti Mahesh, Prithviraj-Movie

తను చనిపోయాక కూడా ఇండస్ట్రీ నుంచి ఎవరు సాయం చేయలేదని మొదటి నుంచి అందరికీ తాను టార్గెట్ అయ్యాడని తెలిపాడు.తనకు చికిత్స అందుతుండగానే చనిపోయాడని.చాలా దారుణమని అన్నాడు.ఒకవేళ తను పోలీస్ ఆఫీసర్ అయి వుంటే మాత్రం ఆయన మరణాన్ని స్టడీ చేసేవాడిని అంటూ ఆయన మరణం పై తనకు అనుమానాలు ఉన్నాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

#Prithviraj #Katti Mahesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube