టాలీవుడ్ సినీ క్రిటిక్ పై దాడి చేసిన అభిమానులు...

గత కొద్దికాలంగా టాలీవుడ్ సినీ క్రిటిక్ కత్తి మహేష్ సినిమా అభిమానుల ఆగ్రహానికి గురి అవుతున్నాడు.అయితే అందుకు కారణం లేకపోలేదు.

 Katti Mahesh In Imax Theater Hyderabad-TeluguStop.com

ఇటీవల కాలంలో కత్తి మహేష్ హిందువుల ఆరాధ్య దైవం అయినటువంటి రాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ప్రజా సంఘాలు కత్తి మహేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

 తాజాగా ఈ రోజు విడుదలైన టువంటి టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ సినిమా చూసేందుకు హైదరాబాదు నగరంలోని ఐమాక్స్ థియేటర్ కి వచ్చాడు.

 దీంతో కత్తి మహేష్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.ఈ దాడిలో భాగంగా కత్తి మహేష్ వాహనానికి ఉన్నటువంటి అద్దాలు కూడా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది.

అయితే అప్పటికే అప్రమత్తమైన కత్తి మహేష్ వెంటనే తేరుకొని అక్కడినుంచి వెళ్ళిపోయాడు.దీంతో స్థానికంగా ఉన్నటువంటి కొందరు వ్యక్తులు దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేయడంతో కొంతమేర గొడవ సర్దుముణిగినట్లు తెలుస్తోంది.

Telugu Cinecritic, Katti Mahesh, Kattimahesh, Tollywoodcine-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే కత్తి మహేష్ పై నాంపల్లి పోలీస్ స్టేషన్ లో హిందువుల దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఓ ప్రముఖ సీనియర్ అడ్వకేట్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.అంతేగాక విచారణకు హాజరు కమ్మని పోలీసులు నోటీసులు కూడా పంపించారు.కానీ కత్తి మహేష్ వాటిని బేఖాతరు చేసినట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube