నేనున్నాను అన్నాడు... ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ..? పవన్ కి 'కత్తి' కౌంటర్  

  • జనసేన అధినేతే పవన్ కళ్యాణ్ తీరుపై కత్తి మహేష్ మరోసారి విరుచుకుపడ్డాడు. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్న ఆయన ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించినప్పుడు మీకు నేనున్నాను అని చెప్పిన పవన్‌ అక్కడ తితలీ తుఫాన్‌ బీభత్సం సృష్టించినా ఇంత వరకు ఎందుకు వెళ్లలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

  • Katti Mahesh Comented Pavan Kalyan-

    Katti Mahesh Comented Pavan Kalyan

  • జనసేనకు జనబలం లేదని, కేవలం సినీ గ్లామర్‌తో పవన్‌ రెచ్చకొట్టే ప్రసంగాలు చేస్తున్నాడని అన్నారు. పవన్‌ను చూడడానికి మాత్రమే జనం వస్తున్నారని, ఆయనకు ఓటు వేయడానికి కాదని అన్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడా ఆయన గెలిచే అవకాశాలు లేవని అన్నారు. ఆయన ఏ ప్రాంతానికి వెళితే, ఆ ప్రాంతంలో పోటీ చేస్తానని అంటున్నారని, ఇటీవల పాయకారావుపేటకు వెళ్లి అక్కడి నుంచి కూడా పోటీ చేస్తానని ప్రకటించారని గుర్తు చేశారు. అది రిజర్వ్‌డ్‌ నియోజకవర్గమని, అక్కడ ఎలా పోటీ చేస్తాడో ఆయనకే తెలియాలని ఎద్దేవా చేశారు.