ఇండస్ట్రీలో చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సాధించుకుంటారు.అలాంటి వాళ్ళలో ప్రస్తుతం తెలుగులో జగపతి బాబు,రాజేంద్ర ప్రసాద్ లాంటి వారు ముందు వరుసలో ఉన్నారు.
అలాగే రావు గోపాల్ రావు కొడుకు గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రావు రమేష్ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి ఇమేజ్ని సంపాదించాడు.ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఆయనకి మంచి గుర్తింపు లభించింది.
తమిళంలో హీరోగా చాలా సినిమాల్లో నటించిన సత్యరాజ్ కూడా తెలుగులో చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు తండ్రిగా, తాతగా నటిస్తున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తో చాలామంది నటులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు అలాంటి వారిలో ప్రభాస్, అనుష్క, రమ్యకృష్ణ లాంటి వారు ఉండగా ఆ సినిమాలో కట్టప్ప గా మంచి క్యారెక్టర్లో నటించి అందరి చేత శభాష్ అనిపించుకున్న నటుడు సత్యరాజ్ కూడా ఉన్నారు.
ప్రస్తుతం ఆయన సత్య రాజ్ పేరుతో కాకుండా కట్టప్పగానే చాలా మంది పిలుస్తున్నారు.బాహుబలి సినిమా పుణ్యమా అని సత్యరాజ్ కు వరల్డ్ వైడ్ క్రేజ్ వచ్చింది.
ఎన్ని సినిమాల్లో చేసిన రానీ గుర్తింపు ఒక్క సినిమాతో రావడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఈ క్రెడిట్ మొత్తం ఆ సినిమా దర్శకుడు అయిన రాజమౌళి కి వెళుతుంది.
ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే సత్యరాజ్ కి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.కొడుకు ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చి తమిళంలో సినిమాలు చేస్తున్నప్పటికి, కూతురు దివ్య కూడా సినిమాల్లోకి రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.దాంతోనే ఆమె ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ ఎక్కువగా చేస్తుంది.ప్రస్తుతం వాళ్ళ నాన్నకి వరల్డ్ వైడ్ క్రేజ్ రావడం వల్ల ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి దివ్య కూడా సినిమాల్లోకి రావాలని చూస్తుంది.
సత్య రాజ్ బాహుబలి సినిమా లోనే కాదు కొరటాల శివ దర్శకుడిగా పరిచయం అవుతూ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి సినిమాలో కూడా సత్యరాజ్ ప్రభాస్ తండ్రి గా నటించారు.ఆ సినిమాలో రెండు వైపులా గొడవలు జరుగుతూ ఉంటే ఒక వైపు గొడవలు ఆపే ప్రయత్నం చేసే క్యారెక్టర్ లో సత్యరాజు గారు జీవించారని చెప్పవచ్చు.
బాహుబలి సినిమా తర్వాత కూడా సత్యరాజు తెలుగులో చాలా సినిమాలు చేశారు కిషోర్ తిరుమల డైరెక్షన్లో రామ్ హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా వచ్చిన సినిమా నేను శైలజ లో కీర్తి సురేష్ తండ్రిగా నటించి మంచి గుర్తింపు సాధించారు.ఫ్యామిలీని పోషించుకోవడానికి తన కూతురికి దూరంగా ఉంటూ వేరే వర్క్ చేసుకుంటూ ఉండే క్యారెక్టర్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో ప్రతి ఫాదర్ ఎదుర్కొనే చిన్న చిన్న ఎమోషన్స్ ని చాలా బాగా పండించారు ఆ సినిమా మంచి విజయం సాధించడంతో తెలుగులో ఆయన బాహుబలి తో వచ్చిన క్రేజ్ కంటిన్యూ చేసుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.మారుతి డైరెక్షన్ లో సాయిధరమ్ తేజ్ హీరోగా రాశికన్నా హీరోయిన్ గా వచ్చిన ప్రతి రోజు పండుగే సినిమాలో సాయిధరమ్ తేజ్ తాత గా నటించి మంచి గుర్తింపు సాధించాడు.రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన హైపర్ సినిమా లో లో రామ్ తండ్రి పాత్ర లో సత్యరాజ్ నటించి మంచి గుర్తింపు సాధించారు ఆ సినిమాలో అవినీతికి అమ్ముడు పోకుండా సిన్సియర్ గా పనిచేసే ఒక ప్రభుత్వ ఉద్యోగి గా పనిచేసే క్యారెక్టర్లో ఒదిగిపోయి నటించాడు అని చెప్పవచ్చు.
అయితే ఈ సినిమాకు కూడా మంచి గుర్తింపు రావడంతో ప్రస్తుతం ఆయన చాలా తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయాడు.