రాజస్థాన్ లో కత్రినా కైఫ్ పెళ్లి వేడుకలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్?

బాలీవుడ్ సీనియర్ నటి కత్రినా కైఫ్ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతోంది.ఈ క్రమంలోనే ఈమె పెళ్లి డిసెంబర్ 8 9 వ తేదీలలో జరగనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

 Katrina Kaifs, Rajasthan, Bollywood, Photos, Viral,latest News,vicky-TeluguStop.com

అయితే తన పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించని కత్రినా తన పెళ్లి పనులలో మాత్రం ఎంతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలోకి విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన మల్లీశ్వరి చిత్రం ద్వారా సందడి చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.ఈ క్రమంలోనే ఈమె ఒక నటుడితో డేటింగ్ లో ఉన్నట్లు ఇదివరకు వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఈ క్రమంలోనే వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇకపోతే ఈమె యూరి నటుడు విక్కీ కౌశల్ తో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే డిసెంబర్ నెలల్లో జరగబోయే వీరి పెళ్లి పనులలో కత్రినా ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇక వీరి పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరగనున్నట్లు అందుకోసం రాజస్థాన్ లోని సిక్స్ సెన్సస్ కోట వీరి పెళ్లికి ముస్తాబవుతున్నట్లు తెలుస్తోంది.

రాజస్థాన్ లోని సిక్స్ సెన్సస్ కోటలో వీరి పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరగనుందని సమాచారం.ఇప్పటికే ఈ కోటలో పెళ్లి పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

Telugu Bollywood, Katrina Kaifs, Netflix, Rajasthan-Movie

ఇక కత్రినా కైఫ్ తన వివాహానికి బాలీవుడ్ సెలబ్రిటీలు రానున్నట్లు తెలుస్తోంది.గత కొద్ది రోజులుగా కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ తో డేటింగ్ లో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.ఇద్దరు కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడం ఆ తర్వాత పలు సందర్భాలలో విదేశీ పర్యటనలు చేస్తూ ఒకేసారి ఇద్దరు కరోనా బారిన పడటం అప్పట్లో సెన్సేషనల్ అయింది.ఇకపోతే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన ఓ సినిమాలో నటిస్తున్న కత్రినా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది.

అయితే తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో తెలియడంతో ఎంతోమంది అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube