పెళ్లికి వచ్చిన అతిథులకు కత్రినా, విక్కీ ఎంత ఖరీదైన బహుమతులు ఇచ్చారో తెలుసా?

బాలీవుడ్ జంట విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గత కొద్ది రోజులుగా వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో మార్మోగి పోతున్నాయి.

 Katrina Kaif Vicky Kaushal Surprises Guests With Special Gifts Details, Katrina-TeluguStop.com

వీరికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.ఈ జంట త్వరలోనే ఒక్కటి కాబోతోంది అంటూ నెల రోజుల ముందు నుంచే పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

ఇక అనుకున్న విధంగానే సోషల్ మీడియాలో వినిపించిన కథనాల ప్రకారం.విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ లు తాజాగా డిసెంబర్ 9న ఒకటయ్యారు.

వీరి పెళ్లికి బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు.ఈ జంట పెళ్లి రాజస్థాన్ లో బంధువులు, సన్నిహితులు, పలువురు ముఖ్య ప్రముఖుల సమక్షంలో అట్టహాసంగా జరిగింది.

ఇకపోతే పెళ్లికి వచ్చిన అతిథులకు వెళ్లిపోయేటప్పుడు కానుకలు ఇస్తుంటారన్న విషయం తెలిసిందే.ఈ జంట కూడా వారి పెళ్లికి హాజరైన అతిథులకు స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్ లను అందజేసినట్లు తెలుస్తోంది.

అయితే స్టార్ హీరోయిన్ కాబట్టి గిఫ్టులు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయి అని భావిస్తున్నారు.

ఇకపోతే కత్రినా తన పెళ్లికి వచ్చిన అతిథులకు గిఫ్ట్ గా ఒక స్వీట్ బాక్స్ తో పాటు స్పెషల్ నోట్ కూడా ఇచ్చిందట.

అందులో మా పెళ్లి వేడుకలకు హాజరై నందుకు థ్యాంక్యూ.మీ హాజరుతో మా వివాహం ఘనంగా ముగిసింది.నా కలల జీవితాన్ని మేము ప్రారంభించబోతున్నాము.అలాగే మాకు ఎంతో సరదాగా ఇక్కడ సమయం గడిచింది.మీకు కూడా అలాగే గడిచిందని ఆశిస్తున్నాం.

పెళ్లి ఆరంభం మాత్రమే ఇంకా మరెన్నో సంబరాలకు మీరు తప్పక హాజరు కావాలి అని నోట్ లో రాసి ఉంది.ఈ జంట తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలు విడివిడిగా వారి ఇంస్టాగ్రామ్ ఖాతాలలో పంచుకున్నారు.విక్కీ కౌశల్ ఆ ఫోటోలను షేర్ చేస్తూ.

మేం కొత్త బంధాన్ని ప్రారంభించబోతున్నాం.మీ అందరి దీవెనలు, ఆశీస్సులు అందించాలి అంటూ రాసుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube