నయనతారని ఫైటర్ అంటూ ప్రశంసించిన కత్రినా కైఫ్  

Katrina Kaif Heaps Praises On South Star Nayanthara, Tollywood, Telugu Cinema, South Cinema, Bollywood - Telugu Bollywood, Katrina Kaif Heaps Praises On South Star Nayanthara, South Cinema, Telugu Cinema, Tollywood

హీరోయిన్స్ మధ్య సాధారణంగా ప్రొఫెషనల్ రైవలరీ ఉంటుంది.సినిమాల విషయంలో కాంపిటేషన్ ఉండటం వలన ఇది కనిపిస్తుంది.

 Katrina Kaif Nayanthara Bollywood

అయితే ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ అలాంటి యాటిట్యూడ్ పెద్దగా చూపించడం లేదు.బెస్ట్ ఫ్రెండ్స్ గా కూడా ఉంటున్నారు.

కొంత మంది భామలు ఇతర హీరోయిన్స్ వ్యాపారాలకి సహకారం అందిస్తున్నారు.ఒకరి మీద ఒకరు అవకాశం దొరికిన ప్రతి సారి ప్రశంసలు కురిపించుకుంటూ ఉన్నారు.

నయనతారని ఫైటర్ అంటూ ప్రశంసించిన కత్రినా కైఫ్-Movie-Telugu Tollywood Photo Image

ఇలాగే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సౌత్ ఇండియా సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార మీద విపరీతంగా ప్రశంసలు కురిపించేసింది.నయనతార ఫైటర్ అంటూ పోగిడేసింది.

కత్రినా సొంత మేకప్‌ బ్రాండ్‌ కేకు నయనతార సౌత్ ఇండియా‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.ఈ నేపథ్యంలో కే ప్రచార ప్రకటనలో భాగంగా నయన్‌ ఇటీవల ముంబై కూడా వెళ్ళింది.

తన మేకప్‌ బ్రాండ్‌ ప్రకటన కోసం నమనతార సమయాన్ని కేటాయించినందుకు కత్రినా సోషల్‌ మీడియా ద్వారా థాంక్స్ చెప్పింది.సౌత్‌ లేడీ సూపర్‌‌స్టార్ ‌నయనతారకు పెద్ద ధన్యవాదాలు.

మీ బీజీ షేడ్యూల్‌లో కూడా ముంబై వచ్చి మా మేకప్‌ బ్రాండ్‌ ప్రకటనకు మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు.మీ ఉదారతకు, అందానికి ఎప్పటికీ సలాం’ అంటూ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

ఓ ఇంటర్య్వూలో కూడా కత్రినా నయనతారతో కలిసి పనిచేసిన అనుభవం గురించి పంచుకుంది.తన అద్భుత నటన, తన సంకల్పం చూసి ఆశ్చర్యపోయాను.తను ఓ ఫైటర్‌.పోరాట యోధురాలిగా కనిపిస్తుంది.

ఆమెలో ఏదో ప్రత్యేకత ఉంది అంటూ ప్రశంసలు కురిపించింది.మొత్తానికి తన మేకప్ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నందుకు నయనతారని కత్రినా భాగానీ కాకా పట్టింది అని ఇప్పుడు బీటౌన్ లో చెప్పుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Katrina Kaif Nayanthara Bollywood Related Telugu News,Photos/Pics,Images..