పెళ్లి తర్వాత కత్రినా కైఫ్ చేసిన మొదటి వంట.. నెట్టింట్లో పెద్ద చర్చే?

మోస్ట్ బ్యూటిఫుల్ గ్లామర్ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ గురించి, తన నటన గురించి అందరికీ తెలిసిందే.తన అందంతో మాత్రం ఎంతో మంది ప్రేక్షకులను ఫిదా చేసింది.

 Katrina Kaif First Cooking After Marriage Viral On Social Media Details, Katrin-TeluguStop.com

అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా నిలిచింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లలో తను కూడా ఉంది.అంతేకాకుండా అత్యధిక పారితోషికం తీసుకునే వారిలో కూడా ఒకరిగా నిలిచింది.

ఇక ఈమె గత కొంత కాలం నుండి మరో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే.మొత్తానికి తన ప్రేమను పెళ్లి తోనే ముడి వేసుకుంది కత్రీనా.

గతంలో ఈ జంట కొంత కాలం వరకు ఫ్రెండ్షిప్ అని చెప్పుకొని బాగా తిరిగారు.కానీ వీరి మధ్య బంధం చూసి అందరూ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అనుకున్నారు.

మీడియా ముందు కూడా ఈ విషయం గురించి వీరికి పలు ప్రశ్నలు ఎదురవడంతో తమ మధ్య కేవలం ఫ్రెండ్షిప్ ఉందని చాలాసార్లు చెప్పుకున్నారు.తాము బయటకు తిరిగినపుడు కూడా చాలా సార్లు మీడియా కంటికి కూడా చిక్కారు.

అలా వారి ప్రేమను చాలా రహస్యంగా కాపాడుకున్నారు.

Telugu Bollywood, Dish, Halwa, Katrina Kaif, Katrinakaif, Vicky Kaushal-Movie

మొత్తానికి ఇటీవలే పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు ఈ బాలీవుడ్ జంట.ఇన్ని రోజులు ప్రేమలో ఉన్న ఈ జంట తమ పెద్దల సమక్షంలో మొత్తానికి ఒకటయ్యారు.ఈనెల 9న రాజస్థాన్ లో సవాయ్ మాధోపూర్ లో అంగరంగ వైభవంగా వివాహం జరుపుకున్నారు.

Telugu Bollywood, Dish, Halwa, Katrina Kaif, Katrinakaif, Vicky Kaushal-Movie

పెళ్లి తర్వాత వీరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.పైగా కత్రినా కైఫ్ తన సోషల్ మీడియాలో ఖాతాలలో కూడా తన ప్రొఫైల్ పిక్ ను కూడా మార్చుకుంది.కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంట ముంబై లో సెటిల్ అయ్యారు.మీడియా ముందుకు వచ్చి పలు విషయాలు కూడా పంచుకున్నారు.

ప్రస్తుతం కత్రినా కైఫ్ తన సోషల్ మీడియా వేదికగా తెగ ఫోటోలను షేర్ చేస్తుంది .మొత్తానికి పంజాబీ కోడలుగా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తొలిసారిగా తన చేతితో మొదటి వంట కూడా చేసేసింది.మామూలుగా కొత్తగా పెళ్లి చేసుకున్న కోడలు ఇంట్లోకి అడుగుపెట్టగానే సాంప్రదాయ ప్రకారం ఏదైనా స్వీటు లాంటివి చేస్తుంటారు.

Telugu Bollywood, Dish, Halwa, Katrina Kaif, Katrinakaif, Vicky Kaushal-Movie

దీంతో కత్రినా కైఫ్ కూడా ఒక తీపి వంటకంగా హల్వా చేసింది.ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోను కూడా తన అభిమానులకు  సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.అందులో ఈ వంటకం నేనే చేశాను అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చుకుంది.

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారడంతో అభిమానులు తెగ లైక్స్ కొడుతున్నారు.కొందరు పాజిటివ్ కామెంట్లు కూడా పెడుతున్నారు.మొత్తానికి ఈ అమ్మడు అనుకున్నది సాధించిందని అంటున్నారు.ప్రస్తుతం పలు సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube