నీతో సెల్ఫీ వద్దు ఆ అమ్మాయిలు కత్రినా ను రెచ్చగొట్టారు.! కోపమొచ్చి ఆమె ఏం చేసిందో తెలుస్తే షాక్!     2018-07-15   12:00:15  IST  Sai Mallula

సాధార‌ణంగా సినిమా సెల‌బ్రిటీలెవ‌రైనా క‌నిపిస్తే ఫొటోల కోసం జనం ఎగబడతారు. ఆటోగ్రాఫ్స్ అంటూ వెంటపడతారు. ఒక్కసారి చూసి నవ్వితే చాలంటూ పరితపిస్తారు. కాని ఇక్కడ కొందరు అమ్మాయిలు మాత్రం బాలీవుడ్ ప్రముఖ నటి క‌త్రినాకైఫ్‌తో మాకు నీతో సెల్ఫీ దిగాలని లేదంటూ గొడవకు దిగారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌త్రినాకైఫ్‌కు మాత్రం తాజాగా వింత అనుభవం ఎదురైంది. `మీతో మాకు సెల్ఫీలు అవ‌స‌రం లేదం`టూ అభిమానులు క‌త్రిన ఎదుటే అరిచి గోల చేశారు. కెన‌డాలోని వాంకోవ‌ర్‌లో క‌త్రినకు ఈ చేదు అనుభ‌వం ఎదురైంది.

Katrina Kaif Fans Misbehave Insist For Selfie In Canada-

Katrina Kaif Fans Misbehave Insist For Selfie In Canada

సల్మాన్ ఖాన్ చేపడుతున్న దబంగ్ టూర్ లో భాగంగా వాంకోవర్ లో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్లింది కత్రినాకైఫ్. రిహార్సల్స్ పూర్తిచేసి హోటల్ కు తిరిగి వెళ్తుండగా.. కొంతమంది అమ్మాయిలు కత్రినాను ఏడిపించారు. నీతో ఫొటో మాకు అక్కర్లేదంటూ తమదైన స్టయిల్ లో ఓ పాట అందుకున్నారు.

దీంతో కత్రినాకు కోపమొచ్చింది. కారు ఎక్కాల్సిన కత్రిన ఆగి వాగ్వాదానికి దిగింది. వెంటనే అభిమానులు కూడా రెచ్చిపోయారు. హీరోయిన్ గా చెప్పుకుంటున్న నువ్వు, కనీస మర్యాద పాటించాలంటూ వాదులాటకు దిగారు. అంతేకాదు, మాకు నీతో ఫొటోలు అక్కర్లేదు. కేవలం సల్మాన్ కోసమే వచ్చామంటూ ఎదురుదాడికి దిగారు. వెంటనే అక్కడున్న భద్రతా సిబ్బంది సర్దిచెప్పడంతో వ్యవహారం సద్దుమణిగింది.

ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. సెల్ఫీలు తీసుకోవ‌డానికి వ‌చ్చిన కొంత మంది అభిమానుల‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డం వ‌ల్లే క‌త్రిన‌పై అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.