ఆ బాలీవుడ్ హీరోని పెళ్లాడబోతోన్న వెంకీ హీరోయిన్...

తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన “మల్లీశ్వరి” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ “కత్రినా కైఫ్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే వెంకటేష్ వంటి స్టార్ హీరో సరసన హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకోవడంతో టాలీవుడ్ సినిమా పరిశ్రమలో సెటిల్ అవుతుందని అందరూ అనుకున్నారు.

 Katrina Kaif And Vicky Kaushal Wedding News Viral-TeluguStop.com

కానీ క్రమక్రమంగా బాలీవుడ్ లో సినిమా ఆఫర్లు ఎక్కువగా రావడంతో మూటాముల్లె సర్దుకుని ముంబై కి వెళ్ళిపోయింది.ఆ తర్వాత మళ్ళీ ఈ అమ్మడు టాలీవుడ్ సినిమా పరిశ్రమ పై పెద్దగా దృష్టి సారించలేదు.

అయితే తాజాగా కత్రినా కైఫ్ పెళ్లి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ఈ ఏడాది డిసెంబర్ నెలలో కత్రినా కైఫ్ బాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రముఖ హీరోగా రాణిస్తున్న యంగ్ హీరో విక్కీ కౌశల్ తో కలిసి ఏడడుగులు వేయబోతున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

 Katrina Kaif And Vicky Kaushal Wedding News Viral-ఆ బాలీవుడ్ హీరోని పెళ్లాడబోతోన్న వెంకీ హీరోయిన్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇందుకు గల కారణాలు లేకపోలేదు.కాగా గత రెండేళ్లుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు ఆ మధ్య విక్కీ కౌశల్ కూడా కత్రినా కైఫ్ ఇంటి వద్ద రెండు మూడు సార్లు కనిపించడంతో వీరిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ షిప్ గురించి తెగ రూమర్లు వచ్చాయి.

కానీ ఇప్పటివరకు కత్రినా కైఫ్ తన పెళ్లి వార్తలపై మాత్రం స్పందించలేదు.దీంతో కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వినిపిస్తున్న వార్తల్లో నిజమెంతనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Telugu Bollywood Hero, Heroine, Katrina Kaif, Katrina Kaif And Vicky Kaushal Wedding, Katrina Kaif And Vicky Kaushal Wedding News Viral, Vicky Kaushal, Vicky Kaushal Wedding-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కత్రినా కైఫ్ బాలీవుడ్ లో సూర్య వంశి అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తుండగా అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, అజయ్ దేవగణ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు అయితే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తవడంతో సినిమా థియేటర్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.కాగా కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న మరో చిత్రంలో హీరోయిన్ గా ఇచ్చే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

#Katrina Kaif #KatrinaKaif #KatrinaKaif #Vicky Kaushal #Vicky Kaushal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube