ఎట్టకేలకు బాలీవుడ్ స్టార్ కపుల్ వెడ్డింగ్ డేట్ బయటకు వచ్చింది.. ఎప్పుడంటే?

Katrina Kaif And Vicky Kaushal To Get Married On December 9 Over 200 Guests Invited

బాలీవుడ్ లో ఇప్పుడు ఈ స్టార్ కపుల్ పెళ్లి గురించే మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.కత్రినా కైఫ్ వివాహంతో ఓ ఇంటిది కాబోతున్నది అని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.

 Katrina Kaif And Vicky Kaushal To Get Married On December 9 Over 200 Guests Invited-TeluguStop.com

రెండున్నర సంవత్సరాల నుండి లవ్ బర్డ్స్ గా విహరించి ఇప్పుడు వివాహం ద్వారా ఒక్కటి కాబోతున్నారు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్. వీరిద్దరూ డిసెంబర్ లో వివాహం చేసుకుంటున్నట్టు ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది.

అయితే వీరిద్దరూ ఇప్పటి వరకు నోరు విప్పలేదు.కానీ రోజు వీళ్ళ పెళ్లి గురించి ఏదొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది.

 Katrina Kaif And Vicky Kaushal To Get Married On December 9 Over 200 Guests Invited-ఎట్టకేలకు బాలీవుడ్ స్టార్ కపుల్ వెడ్డింగ్ డేట్ బయటకు వచ్చింది.. ఎప్పుడంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఎట్టకేలకు వీరి వివాహ తేదీ ఇదే అంటూ   కన్‌ఫామ్‌ అవుతుంది.రాజస్థాన్ లోని సవాయ్ మధోపూర్ జిల్లా లోని 1వ శతాబ్దపు ప్యాలెస్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా లో డిసెంబర్ 9న ఈ వివాహ వేడుక చేసుకుంటున్నారని తెలుస్తుంది.

కత్రినా కైఫ్ సన్నిహితుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 9న వీరిద్దరూ ఒక్కటి అయ్యేందుకు సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది.

Telugu Katrina Vicky, Katrinavicky, Katrina Kaif, Katrinakaif, Senses Fort, Vicky Kaushal-Movie

ఇక ఈ పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరగనుంది.ఇక ఈ పెళ్లి డిసెంబర్ 7 నుండి 9 వరకు వరుసగా సంగీత్, మెహందీ, పెళ్లి జరగనున్నాయి.అందుకోసం ఇరు బంధువులు పెద్ద ఎత్తున సిద్ధం అయ్యాయి.

Telugu Katrina Vicky, Katrinavicky, Katrina Kaif, Katrinakaif, Senses Fort, Vicky Kaushal-Movie

ఇక ఈ వెడ్డింగ్ కు దాదాపు 200 మంది అతిధులు హాజరవబోతున్నారని తెలుస్తుంది.ఇక ఇప్పటికే కత్రినా, విక్కీ ఇరువైపులా బంధువుల కోసం వసతి సదుపాయాలను నిర్వహించడంతో బిజీగా ఉన్నారట.ఇక వీరి పెళ్ళి కోసం సభ్యసాచి డిజైనర్ లుక్ లు రెడీ అయ్యాయని ప్రచారం జరుగుతుంది.ఇక వీరిద్దరూ పెళ్ళిలో మెస్మరైజ్ చేయబోతున్నారని టాక్ నడుస్తుంది.ఇక మొత్తానికి పెళ్ళికి ఆల్ సెట్ అయ్యిందని తెలుస్తుంది.

#Senses Fort #Katrina Kaif #KatrinaKaif #Vicky Kaushal #Katrina Vicky

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube