పెళ్లికి వెళ్లాలంటే సీక్రెట్ కోడ్ తప్పనిసరి.. ఈ నెల 9న కత్రీనా-విక్కీ రాయల్ వెడ్డింగ్..

Katrina Kaif And Vicky Kaushal Marraige Updates

మనం ఎవరినైనా పెళ్లికి ఆహ్వానించాలంటే ఏం చేస్తాం? సదరు వ్యక్తుల ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి వివాహ పత్రిక అందించి.పెళ్లికి రావాలని ఆహ్వానిస్తాం.

 Katrina Kaif And Vicky Kaushal Marraige Updates-TeluguStop.com

అలాగే వారు కూడా వచ్చి.నూతన వధూవరులను ఆశ్వీరదించి.

విందును స్వీకరించి వెళ్తారు.అయితే బాలీవుడ్ సెలబ్రిటీలు అయిన కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలో ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు.

 Katrina Kaif And Vicky Kaushal Marraige Updates-పెళ్లికి వెళ్లాలంటే సీక్రెట్ కోడ్ తప్పనిసరి.. ఈ నెల 9న కత్రీనా-విక్కీ రాయల్ వెడ్డింగ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ పెళ్లికి వచ్చే అతిథులకు సీక్రెట్ కోడ్స్ చెప్పారట.వాటిని ఎంట్రీ పాయింట్ దగ్గర చెప్తేనే లోనికి వెళ్లే అవకాశం ఉంటుందట.

ఇంతకీ ఈ కోడ్ కథేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కత్రీనా, విక్కీ పెళ్లికి ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలయ్యాయి.

పెళ్లికి సంబంధించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.వీరి పెళ్లి ఓ రాజ వివాహం మాదిరి జరగబోతుందట.

అయితే కరోనా మూలంగా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారట.పెళ్లికి వచ్చే అతిథులకు ఎంట్రీ కోడ్ తప్పనిసరి చేశారట.

వీరు పెళ్లికి ఆహ్వానించిన అతిథులకు ప్రత్యేకమైన కోడ్ చెప్తారట.ఎంట్రీ పాయింట్ దగ్గర ఆ కోడ్ చెప్పిన వారే లోపలికి వెళ్తారట.

లేదంటే వెళ్లడం కుదరదట.వివాహంలో ప్రైవసీ కోసమే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పెళ్లికి వచ్చే అతిథులు సెల్ ఫోన్లు తీసుకురావద్దని చెప్పారట.

Telugu Bollywood, Katrina Kaif, Ups, Rajasthan, Royal, Secret Codes, Vicky Katrina, Vicky Kaushal, Viky Kaushal-Movie

ఈ బాలీవుడ్ జంట పెళ్లికి ముఖ్యమైన అతిథులు మాత్రమే హాజరు కానున్నారు.పెళ్లికి వచ్చే వారి కోసం టైగర్ సఫారీ కూడా ఏర్పాటు చేస్తున్నారట.దీనికి జోగి మహల్ నుంచి ఎంట్రీ పాయింట్ ఉంటుందట.

అటు భద్రత కోసం ప్రైవేటు లగ్జరీ కారును ఏర్పాటుచేశారట.అటవీ శాఖ నిబంధనల ప్రకారం టైగర్ సఫారీ చేయవచ్చట.

వీరి పెళ్లి డిసెంబర్ 9న రాజస్థాన్ సవాయ్ మాధోపూర్ లో జరగనుంది.మూడు రోజుల పాటు రాయల్ వెడ్డింగ్ మాదిరిగా జరగనుందట.

చౌత్ కా బర్వారా కొండపై శతాబ్దాల నాటి చౌత్ మాత ఆలయం సమీపంలో ఈ వేడుక జరగబోతుంది.

#Viky Kaushal #Royal #Rajasthan #Secret Codes #Katrina Kaif

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube