ఆ ఇద్దరు అమ్మాయిలు మరీ అతి చేస్తున్నారంటున్న కత్తి మహేష్‌  

Kathi Mahesh Comments On Swetha Reddy And Gayatri Guptta-

తెలుగు ప్రేక్షకులకు కత్తి మహేష్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బుల్లి తెర మరియు వెండి తెర ప్రేక్షకులు కత్తి మహేష్‌ గురించి చాలా తరచుగా వింటూనే ఉంటారు.సినిమాలు రాజకీయాలు అనే తేడా లేకుండా అన్ని విభాగాల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన వాణిని వినిపించగల వ్యక్తి కత్తిమహేష్‌...

Kathi Mahesh Comments On Swetha Reddy And Gayatri Guptta--Kathi Mahesh Comments On Swetha Reddy And Gayatri Guptta-

ఈయనకు బిగ్‌బాస్‌ ద్వారా బాగా గుర్తింపు వచ్చింది.మొదటి సీజన్‌లో ఒక సామాన్యమైన సెలబ్రెటీగా ఇతడు ఎంట్రీ ఇచ్చాడు.అయితే అనూహ్య పరిణామాల మద్య నాలుగు అయిదు వారాలు ఉన్నాడు.

దాంతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.తాజాగా బిగ్‌బాస్‌ 3 వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఆ విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Kathi Mahesh Comments On Swetha Reddy And Gayatri Guptta--Kathi Mahesh Comments On Swetha Reddy And Gayatri Guptta-

బిగ్‌బాస్‌ నిర్వాహకులకు తమను మోసం చేయడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించారు అంటూ శ్వేత రెడ్డి మరియు గాయత్రి గుప్తలు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే.బిగ్‌బాస్‌ను ఎలా సంతృప్తి పర్చుతారు అంటూ వీరిని నిర్వాహకులు ప్రశ్నించారట.ఆ ప్రశ్నలు వీరికి ఇబ్బంది కలిగించాయని పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది.

ఈ విషయమై కత్తి మహేష్‌ మాట్లాడుతూ బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఒక వ్యక్తిని పార్టిసిపెంట్‌గా తీసుకున్న సమయంలో వారికి ఉన్న ప్రతిభ ఏంటీ ఎలా బిగ్‌బాస్‌ను ఇంప్రెస్‌ చేస్తారు.తద్వార ప్రేక్షకులను ఎలా ఇంప్రెస్‌ చేస్తారు అంటూ ప్రశ్నించడం చాలా కామన్‌...

ఇలా ప్రతి ఒక్కరిని అడుగుతూనే ఉంటారు.ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు ఏదో ఒక యాక్టివిటీని చేయాల్సిందే.

మరి వీరిని కూడా మీ ప్రత్యేకత ఏంటీ, మీరు ఎలా బిగ్‌బాస్‌ను ఇంప్రెస్‌ చేస్తారు అని అడిగి ఉండవచ్చు.అంతే తప్ప మరేం లేదు.వీరికి ఫైనల్‌ లిస్ట్‌లో ఛాన్స్‌ దక్కని కారణంగా ఇలా కేసులు పెడుతూ ఉండవచ్చు అంటూ కత్తి మహేష్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు...

వారిద్దరు ఈ విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారని ఇక్కడితో వదిలేస్తే బెటర్‌గా ఉంటుందంటూ కత్తి మహేష్‌ చెప్పుకొచ్చాడు.