కత్తి మహేష్ అరెస్ట్ వల్ల వాయిదా పడ్డ షూటింగ్... పాపం రామ్ గోపాల్ వర్మ...

టాలీవుడ్ ప్రముఖ సినీ క్రెడిట్ కత్తి మహేష్ ఇటీవలే హిందువు దేవుడు అయినటువంటి శ్రీ రాముడు పై పలు అనుచిత వ్యాఖ్యలు చేశాడని హైదరాబాదు పోలీసులు అరెస్టు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.ఉన్నట్లు ఉండి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కత్తి మహేష్ రావడంతో ఆయన నటిస్తున్న పలు చిత్రాల షూటింగ్ పనులు ఆగిపోయాయి.

 Cine Critic Kathi Mahesh Arrest Impact On Ram Gopal Varma Movie Shooting Kathi-TeluguStop.com

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కత్తి మహేష్ “రామ్ గోపాల్ వర్మ” అనే చిత్రం లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు. ఉన్నట్లుండి కత్తి మహేష్ అరెస్ట్ అవడంతో చిత్ర యూనిట్ సభ్యులు కొంతమేర ఆందోళన చెందుతున్నారు.

 అంతేకాక కత్తి మహేష్ కి ఇటీవలె 14 రోజుల రిమాండ్ విధించడంతో కత్తి మహేష్  స్థానంలో మరో నటుడిని తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

కాగా ఆ మధ్య కాలంలో కత్తి మహేష్ హిందూ దేవుడు శ్రీ రాముడు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ శ్రీరాముడి నివాసంలో ఎప్పుడు వేశ్యలు ఉండేవారని అంతేగాక శ్రీ రాముడు నిత్యం మద్యం సేవించే వాడని అంటూ పలు వ్యాఖ్యలు చేశాడు.

దీంతో హైదరాబాదులోని నాంపల్లి పోలీస్ స్టేషన్లో కొందరు వ్యక్తులు కలిసి కత్తి మహేష్ ను అరెస్టు చేయాలంటూ ఫిర్యాదు నమోదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube