కత్తి మహేష్‌ తండ్రి కూడా మామూలోడు కాదుగా..   Kathi Mahesh Father Kathi Obulesu Supports His Son     2018-07-11   01:18:38  IST  Bhanu C

గత కొన్ని రోజులుగా కత్తి మహేష్‌ గురించి తెలుగు రాష్ట్రాల మీడియాల్లో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. కొన్ని నెలల క్రితం పవన్‌ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కత్తి మహేష్‌, ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మరియు మోడీలపై విరుచుకు పడ్డాడు. ఇలా విపరీతంగా క్రేజ్‌ను దక్కించుకున్న కత్తి మహేష్‌ తాజాగా రామాయణం మరియు రాముడిపై సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాస్పదం అయ్యాడు. రాముడిపై వ్యాఖ్యలు చేయడంతో హిందూ సంఘాల వారు తీవ్రంగా తప్పుబట్టి, పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కూడా కత్తి మహేష్‌ ఇంకా ఇంకా వ్యాఖ్యలు చేస్తూ వచ్చాడు.

కత్తి మహేష్‌ తీరుకు వ్యతిరేకంగా పలువురు హిందూ సంఘ నేతలు మరియు ప్రజా సంఘాల వారు ఆందోళనలు ఉదృతం చేయడం సాగించారు. దాంతో హైదరాబాద్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు కత్తి మహేష్‌ను హైదరాబాద్‌ నుండి బహిష్కరించారు. అనుమతి లేకుండా హైదరాబాద్‌కు వస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఈ సందర్బంగా హైదరాబాద్‌ పోలీసులు కత్తి మహేష్‌ను హెచ్చరించి ఆయన సొంత జిల్లా అయిన చిత్తూరు పోలీసులకు అప్పగించడం జరిగింది.

కత్తి మహేష్‌ తీరుపై పలువురు పలు రకాలుగా వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ఆయన తండ్రి మాత్రం కొడుకు తీరుకు మద్దతుగా నిలిచాడు. కత్తి మహేష్‌ తండ్రి మాట్లాడుతూ.. తలితుడు కాబట్టే తన కొడుకుని ఈ విధంగా ఇబ్బంది పెడతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కొడుకు రాముడి గురించి చేసిన ప్రతి ఒక్క వ్యాఖ్య నిజమైనదే అని, రాముడి గురించి మాట్లాడిన ప్రతి మాట నూరు శాతం సమంజసం అంటూ చెప్పుకొచ్చాడు. రామాయణం ఒక విష వృక్షం అని, దాన్ని పూర్తిగా చదివిన వారికి రాముడు ఎలాంటి వాడో అర్థం అవుతుందంటూ కత్తి మహేష్‌ తండ్రి ఓబులేసు చెప్పుకొచ్చాడు.

కొడుకు చేసిన తప్పుడు పనిని ఓబులేసు సమర్ధించడంను ప్రతి ఒక్కరు తప్పుబడుతున్నారు. ఓబులేసుపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పలువురు సిద్దం అవుతున్నారు. ఓబులేసు క్రిస్టియన్‌ అవ్వడం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా కొందరు విమర్శలు చేస్తున్నారు. ఎవరి దైవంను వారు పూజించుకుంటూ, మరొకరి దైవంను గౌరవించాల్సిన అవసరం ఉంది. కత్తి మహేష్‌ తండ్రి ఓబులేసు కూడా పబ్లిసిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటూ మరి కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కత్తి మహేష్‌ ఫ్యామిలీని తెలుగు రాష్ట్రాల నుండి బహిష్కరించాల్సిన అవసరం ఉందంటూ మరి కొందరు అంటున్నారు.