సునీత పెళ్లి కామెంట్లపై కత్తి మహేష్ వివరణ.. ఏం చెప్పారంటే..?  

టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత, రామ్ ల వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.సునీతకు ఈ వివాహం రెండో వివాహం కాగా రామ్ కు కూడా రెండో పెళ్లే కావడం గమనార్హం.

TeluguStop.com - Kathi Mahesh Clarity About Sunitha Marriage In Facebook Post

శంషాబాద్ లోని అమ్మపల్లి ఆలయ ప్రాంగణంలో వివాహం జరగగా దాదాపు 200 మంది అతిథులు ఈ వేడుకకు హాజరయ్యారు.సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం ఈ వివాహ వేడుకకు హాజరు కావడం గమనార్హం.

సోషల్ మీడియాలో సునీత రామ్ ల వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.అయితే ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ కళ్లలో ఆనందం చూస్తే ఏదో ఇబ్బంది.? ఆ కళ్లలో ఆనందం ఏమిటి.? సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు.? అని పోస్ట్ పెట్టారు.ఆ పోస్ట్ వైరల్ కావడం సునీత రామ్ ల పెళ్లిపై కత్తి మహేష్ దారుణంగా వ్యాఖ్యలు చేసినట్టు వార్త వైరల్ కావడంతో కత్తి మహేష్ ఆ పోస్ట్ కు స్పందించి వివరణ ఇచ్చారు.

TeluguStop.com - సునీత పెళ్లి కామెంట్లపై కత్తి మహేష్ వివరణ.. ఏం చెప్పారంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సామాన్యులకు, జర్నలిస్టులకు తను వేసిన సెటైర్ అర్థం కాలేదని.సునీత గారి పెళ్లిపై పెద్దలు పడుతున్న ఇబ్బంది గురించి తను చేసిన కామెంట్లు మరో విధంగా అర్థమయ్యాయని కత్తి మహేష్ వివరణ ఇచ్చుకున్నారు.మరోవైపు సునీత రామ్ లు ప్రీ వెడ్డింగ్ పార్టీలు ఇవ్వడంతో రిసెప్షన్ నిర్వహించడం లేదని తెలుస్తోంది.అయితే కొన్ని చిన్నచిన్న పార్టీలు నిర్వహించబోతున్నట్టు కీలక ప్రకటన చేశారు.

సునీత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా సంవత్సరాల నుంచి తనను పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారని.కానీ పిల్లలను దృష్టిలో ఉంచుకుని ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చానని చెప్పారు.

పెళ్లి విషయంలో తను తీసుకున్న నిర్ణయానికి కుటుంబం నుంచి మద్దతు లభించిందని సునీత చెప్పుకొచ్చారు.

#KathiMahesh #SingerSunitha #Mango Ram #Viral Post

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు