కత్తి మహేష్ మైనింగ్ వ్యాపారం.. డెత్ సీక్రెట్స్ రివీల్?

సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్ మరణించిన సంగతి తెలిసిందే.ఇక ఆయనకు సినీ ఇండస్ట్రీ మొత్తం సంతాపం తెలిపింది.

 Kathi Mahesh Business Friend Suresh Sensational Statement Over Suspicious Death-TeluguStop.com

ఈయన బ్రతికున్నంత కాలం ఈయన చేసిన విమర్శల గురించి అందరికీ తెలిసిందే.ఇక ఈయన మరణం తర్వాత కొన్ని అనుమానాలతో పాటు, కొన్ని నిజాలు కూడా బయట పడుతున్నాయి.

అంతేకాకుండా ఆయన ఓ మైనింగ్ వ్యాపారం చేస్తున్నట్లు కూడా బయటపడింది.

కత్తి మహేష్ సన్నిహితులు.

ఆయన మరణంపై అనుమానాలు ఉన్నాయని అనడంతో వాళ్ల ఆదేశాలను ప్రభుత్వం స్పందించింది.ఇక ప్రమాదం జరిగిన సమయంలో ఆయనతో కార్ డ్రైవింగ్ చేస్తున్న సురేష్ అనే వ్యక్తిని దర్యాప్తు చేయగా కొన్ని విషయాలు తెలిశాయి.

తను కార్ డ్రైవర్ కాదని.తనకు, కత్తి మహేష్ కు మధ్య వ్యాపార ఒప్పందాలు నడుస్తున్నాయని తెలిపాడు.

తన పేరు మీద 10 హెక్టార్లు, కత్తి మహేష్ పేరు మీద 5 హెక్టార్లతో మైనింగ్ ని లీజ్ చేయాలనుకున్నారట.అది మొత్తం 12.5 ఎకరాలలో మైనింగ్ చేయాలని ప్లాన్ చేశారట.

ఇక దానికి సంబంధించిన కొన్ని వివరాల కోసం ప్రమాదం జరిగిన రోజు ఎమ్మార్వో ఆఫీస్ నుండి బయలుదేరారట.

ఇక ప్రమాదం జరిగిన సమయంలో తన సీటు బెల్టు పెట్టుకోవడంతో పాటు తన ముందున్న 2 ఎయిర్ బ్యాగ్ లు తెరుచుకోవడంతో కొంత వరకు గాయాలయ్యాయని తెలిపాడు.ఇక కత్తి మహేష్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని, తాను చెప్పిన కూడా తనకు సౌకర్యంగా ఉండదని అన్నాడట.

కారు 100 స్పీడ్ దాటిన తర్వాత నిద్ర రావడం తో సీట్ బెల్ట్ పెట్టుకుని పడుకున్నాడట కత్తి మహేష్.అంతలోనే ప్రమాదం జరిగిందని, ఆయన లావుగా ఉండటంతో ఎక్కువ డ్యామేజ్ అయిందని తెలిపాడు సురేష్.

Telugu Kathimahesh, Maheshkathi, Tollywood-Movie

ఇక పోలీసులు రావడం హాస్పిటల్ లో చేర్చడం వరకు కత్తి మహేష్ స్పృహ తో ఉన్నాడని తెలిపాడు.ఇక ఆయనను ఐసియూ నుండి జనరల్ వార్డ్ కు షిఫ్ట్ చేశాక కూడా తనతో మాట్లాడాడని.కానీ తాను చనిపోతాడని అస్సలు అనుకోలేదట.ఇక హాస్పిటల్లో చేర్చినప్పటి నుండి ఆయనకు లంగ్స్ ప్రాబ్లం లేదని చనిపోయిన రోజు లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పడంతో షాక్ అయ్యాడట సురేష్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube