టైటానిక్ సినిమా చూడాలంటేనే చిరాకు అంటున్న హీరోయిన్

హాలీవుడ్ లో జేమ్స్ కెమరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన టైటానిక్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ సినిమా హాలీవుడ్ లో ఎన్నో రికార్డులు సృష్టించింది.

 Kate Winslet Says She Hates Watching Titanic Now, Tollywood, Hollywood, World Ci-TeluguStop.com

రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని తెరకెక్కించిన ఈ సినిమా అన్ని దేశాల ప్రేక్షకులని అలరించింది.ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఫెవరెట్ ఫిలిం అయినా ఈ సినిమాలో నటించిన హీరోయిన్, హీరోయిన్లుకి తరువాత స్టార్ ఇమేజ్ వచ్చింది.

ఇందులో హీరోయిన్ గా కేట్ విన్స్లెట్ నటించింది.ఈ సినిమా ఆమెకి హీరోయిన్ గా ఎంతో ఇమేజ్ తీసుకొచ్చింది.

జేమ్స్ కెమరూన్ నుంచి వచ్చిన అద్భుతమైన ప్రేమకావ్యంగా ఈ సినిమా ఇప్పటికి ఎందరో మన్ననలు అందుకుంటుంది.అయితే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మాత్రం టైటానిక్ చూడటం అంటేనే చిరాకు అంటుంది.

టైటానిక్‌ వచ్చి 20 ఏళ్లు అవుతున్న ఈ సినిమా ఇప్పటికి ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది.ఎన్ని సార్లు చూసిన చూడాలనిపిస్తుంది.అలాంటి ఈ సినిమా పై తాజాగా హీరోయిన్‌ కేట్‌ ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆమె టైటానిక్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన కెరీర్‌నే మలుపుతిప్పిన ఈ సినిమా అంటే అసలు ఇష్టం ఉండదని, ఇప్పుడు ఈ సినిమా చూడాలంటేనే అసహ్యం వేస్తోందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.కాగా ప్రస్తుతం కేట్‌ అవతార్‌ సీక్వెల్‌లో లీడ్‌ రోల్‌ పోషిస్తున్నట్లు సమాచారం.

కాగా టైటానిక్‌ డైరెక్టర్‌ కామెరూన్‌ ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా అంటే ఎందుకు తనకి ఇష్టం లేదు అనే విషయాన్ని మాత్రం కేట్ చెప్పలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube