అవతార్ 2 కోసం ఏడు నిమిషాలకి పైగా నీటిలో ఉన్న హీరోయిన్

హాలీవుడ్ వచ్చిన అవతార్ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందింది.

 Kate Winslet Recalls Scary Avatar 2 Underwater Sequence, Hollywood, James Camero-TeluguStop.com

ఇండియాలో కూడా వంద కోట్లకి పైగా కలెక్ట్ చేసింది అంటే సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు.ఇప్పుడు జేమ్స్ కెమరూన్ అవతార్ సీక్వెల్ ని తెరకేక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.

సినిమా మొత్తం మోషన్ క్యాప్చర్ విధానం ద్వారానే తెరకెక్కించారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ కేట్ విన్ స్లేట్ నటిస్తుంది.

ఇక ఈ సినిమా షూటింగ్ గురించి ఈమె ఓ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలని వెల్లడించింది.

Telugu Avatar, Avatar Scene, Hollywood, James Cameron, Kate Winslet, Katewinslet

అవతార్ 2 సినిమా షూటింగ్ లో ఈమె ఓ సాహసం హేసింది.ఊపిరి బిగబట్టి నీటి అడుగులో 7 నిమిషాల 14 సెకన్ల సీన్ ఒకటి చేసింది.ఈ ఫొటో షేర్ చేసినప్పుడు అభిమానులు అబ్బురపడ్డారు.

ఈ సీన్ షూటింగ్ కి సంబంధించి తన అనుభవాలని కేట్ పంచుకుంది.ఈ సీన్ షూట్ చేసిన తర్వాత మైండ్ బ్లాంక్ అయ్యింది.

నీటి బుడగలను చూడడం తప్ప ఏ ఆలోచన లేదు.ఒక దశలో నేను చనిపోయానని అనిపించింది.

మెంటల్ గా కూడా చనిపోయానని ఫిక్స్ అయిపోయాను.అయితే అద్బుతం జరిగింది.నిజంగా అలాంటి సాహసం చేస్తానని అనుకోలేదని ఆ సన్నివేశం షూటింగ్ కి సంబందించిన విషయాలు చెప్పింది.‘మిషన్ ఇంపాజబుల్’ సినిమా కోసం టామ్ క్రూజ్ ఆరు నిమిషాల అరసెకను ఊపిరిబిగబడితే.కేట్ విన్ స్లేట్ ఏకంగా ఏడు నిమిషాలకు పైగా బిగబట్టి హాలీవుడ్ లో అరుదైన రికార్డు నెలకొల్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube