బ్యాంకునే మోసం చేసిన కేటు గాళ్లు.. ఏకంగా కోటీ నలభై లక్షలు స్వాహా.. !

సంస్ధలను కాపాడవలసిన వారే కన్నం వేస్తున్న రోజులు.అందుకే ఎవరిని నమ్మడానికి వీలు లేకుండా ఉంది.

 Kate Guys Who Cheated The Bank Swaha Crore Forty Lakhs In One Go, Janagam, Icic,-TeluguStop.com

ఇక మోసం చాటున ఎన్నోవేషాలు తెరమీదికి వస్తున్న నేటికాలంలో రక్షణ కలిపిస్తారని కాపలా పెట్టుకున్న సెక్యూరిటీ వారు సైతం చిక్కులు తెస్తున్నారు.

కాగా దాదాపు అన్ని చోట్ల ఏటీయంలకు సెక్యూరిటీగా సీసీ కెమెరాలు ఉంటాయి.

ఇలా ఉన్న కూడా దొంగలు ఆగడం లేదనుకోండి.కానీ ఆ సీసీ కెమెరాలకు చిక్కకుండా, ఏటీఎంలో నగదు పెట్టాల్సిన సెక్యూరిటీ సంస్థ సిబ్బందే విడతలవారీగా దాదాపు రూ.1.40 కోట్లను కొల్లగొట్టారు.ఆ వివరాలు చూస్తే.

రైటర్స్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, రైటర్స్‌ సేఫ్‌ గార్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ అనే సెక్యురిటీ సంస్ద, ఏటియం మిషిన్లలో డబ్బులు జమ చేస్తుంది.

ఈ క్రమంలో ఈ సంస్ద జనగామ జిల్లాతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కెనరా బ్యాంకులకు చెందిన మొత్తం 18 ఏటీఎం సెంటర్లలో నగదును జమ చేయడానికి పాసికంటి వెంకటేశ్‌, గుర్రం ఉపేందర్‌, చైతన్యకుమార్‌ గుమ్మడవెల్లి, గట్టు రాజు లను ఉద్యోగస్తులుగా నియమించుకుంది.

కాగా ఈ కేటుగాళ్లు కుమ్ముక్కై ఏటియంలో నగదు జమచేసే క్రమంలో సుమారుగా రూ.1,39,67,900 ను విడతల వారిగా 17 రోజుల వ్యవధిలో కొట్టేశారు.ఈ దొంగతనాన్ని తమ బ్యాంకు ఆడిట్‌ లో కనుగొన్న సిబ్బంది వెంటనే పోలీసులకు కంప్లెంట్ ఇచ్చారట.

విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు రోజూ ఏటీఎంలో నగదు జమచేసే సమయంలో స్వాహా చేసినట్లు గుర్తించామని జనగామ అర్బన్‌ పోలీసులు వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube