ఆ ఒక్క వ్యక్తి కోసం...“వైసీపీ , టీడీపీ ” పట్టు   Katasani Joins Ysrcp Are TDP..?     2018-04-11   01:00:42  IST  Bhanu C

ఎన్నికలు దెగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలలో ఉండే ఆశావాహుల నుంచీ అప్పటికే తిష్టవేసుకుని కూర్చున్న స్థానిక ఎమ్మెల్యేల వరకూ కూడా ప్రతీ ఒక్కరు తమ తమ పార్టీలలో టిక్కెట్లు కోసం ఎంతో ఆరాటపడుతుంటారు..పార్టీల అధినేతల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతూ సిఫార్స్ లేఖలతో ఒకటికి వందసార్లు ప్రదక్షిణాలు చేస్తూనే ఉంటారు అయినా సరే టిక్కెట్టు వస్తుందో రాదో తేల్చి చెప్పడం మాత్రం కష్టం..అయితే కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ కింద చదివించినా సరే చివరి నిమిషం వరకూ కూడా టిక్కెట్టు వస్తుందనే నమ్మకం మాత్రం ఉండదు..


ఇదిలాఉంటే ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా చూసుకుంటే అసలు ఈ సారి ఎంతమంది సిట్టింగ్ లకి టిక్కెట్లు ఇస్తారో కూడా చెప్పలేము…అయితే ఏపీలో రెండు బలమైన పార్టీలైన వైసీపి ,టిడిపి పార్టీలు మా పార్టీలో కి రండి మీకు ఎమ్మెల్యేగా టిక్కెట్టు ఇస్తాము అంటూ ఓ మాజీ ఎమ్మెల్యే వెంటపడుతున్నాయట..ఇంతకూ మించి అదృష్టం మరెక్కడైనా ఉంటుందా చెప్పండి..అయితే సదరు ఎమ్మెల్యే మాత్రం వారికి ఎటువంటి హామీ ఇవ్వకుండా తటస్థంగా ఉన్నాడట..టిక్కెట్లు కోసం ఆశావాహులు కొట్టుకుని చస్తుంటే సదరు ఎమ్మెల్యే కి పిలిచి మరీ టిక్కెట్లు ఆఫర్ చేస్తున్నారు అంటే మరి ఆ ఎమ్మెల్యే స్టామినా ఏంటో కూడా తెలుసుకోవాలి కదా..ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరూ ఏమిటా కధ అంటే..

కర్నూలు జిల్లాకు చెందిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే “కాటసాని రాంభూపాల్ రెడ్డి”..ఈయన ప్రస్తుతం బీజేపి నేతగా ఉన్నారు ఆయితే గత కొంతకాలంగా పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వడం లేదట..అందుకే పార్టీ కార్యక్రమాలకి సైతం దూరంగా ఉంటున్నారు.. అయితే త్వరలోనే ఈయన వైసీపిలో వెళ్తున్నారు అంటూ ఒక పక్క వినిపిస్తుంటే మరో పక్క మా పార్టీలోకి రండి అంటూ టిడిపి వాళ్ళు సైతం అడుగుతున్నారట..మీరు మా పార్టీలోకి రండి అంటే మా పార్టీలోకి రండి అంటూ వర్తమానాలు పంపుతున్నారని తెలుస్తోంది..అసలు “కాటసాని” కోసం ఇరు పార్టీలు ఎందుకు అంతగా పట్టు బడుతున్నాయి..అంటే పాణ్యం నుండి ఐదుసార్లు ఎంఎల్ఏగా గెలిచిన కాటసానికి నియోజకవర్గంలో మంచి పట్టుంది. అయితే,పోయిన ఎన్నికల్లో కాటసాని స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేశారు.వైసిపి అభ్యర్ధిగా పోటీ చేసిన గౌరు చరితారెడ్డి చేతిలో సుమారు 12 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

అయితే గౌరుకు సుమారు 72 వేల ఓట్లు వస్తే , కాటసానికి మాత్రం 60 వేల ఓట్లు వచ్చాయి…అంటే కేవలం 12 వేల ఓట్లు తేడా తో ఓడిపోయారు అంతేకాదు దాదాపు 60 వేల ఓట్లు ఆయనకీ పోల్ అయ్యాయి అంటే కటసానికి అక్కడ ఎంత పట్టు ఉందో తెలుస్తుంది…అయితే జగన్ కాటసాని కోసం విశ్వప్రయత్నం చేస్తున్నాడట అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపి తరుపున చరితారెడ్డి పోటీ చేయరని ఆమెకి అనారోగ్యం కారణంగా దూరంగా ఉంటారని తెలుస్తోంది..ఈ సమయంలో గత ఎన్నికల్లో వైసీపికి గట్టి పోటీ ఇచ్చిన కాటసాని వైసీపిలోకి వస్తే వైసీపి ఈ సరి కూడా గెలుపు తమదేననే ధీమాలో ఉన్నారు వైసీపి వర్గం ఇదిలాఉంటే..మరో పక్క చంద్రబాబు కూడా కాటసాని తెలుగుదేశం లోకి వచ్చేలా చేయండి అంటూ పార్టీలోని కీలక వ్యక్తులకి ఆ భాద్యత అప్పగించారట..అయితే టిడిపి వాళ్లకి కాటసాని చిక్కడు దొరకడు అన్న చందంగా తిరుగుతున్నాడని వారితో అసలు టచ్ లో కి వెళ్ళడానికే కాటసాని ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది..అయితే కాటసాని అనుచరులు మాత్రం వైసీపిలోకి వెళ్ళమని ఒత్తిడి చేస్తున్నారని టాక్..మరి కాటసాని ఎ పార్టీలోకి వెళ్తారు అనేది కొద్ది రోజులూనే తేలిపోనుంది అంటున్నారు..