టైటిల్ : కాటమరాయుడు
జానర్ : ఫ‌్యామిలీ అండ్ యాక్షన్ మూవీ
తారాగణం : పవన్‌కళ్యాణ్, శృతీహాసన్, నాజర్, ప్రదీప్‌సింగ్ రావత్, రావూ రమేష్, శివబాలాజీ
సంగీతం : అనూప్ రూబెన్స్
నిర్మాత : శరత్ మరార్
దర్శకత్వం : కిషోర్ పార్థాసాని (డాలి)
సెన్సార్ రిపోర్ట్: U
రిలీజ్ డేట్: 24 మార్చి, 2017
పవన్‌కళ్యాణ్ హిట్ సినిమా పడితే చాలు టాలీవుడ్ పాత రికార్డులకు చెదలు పట్టేయడం ఖాయం.అత్తారింటికి దారేది సినిమాతో అప్పటి వరకు ఉన్న పాత రికార్డులకు పాతరేసిన పవన్ గత రెండు సినిమాలతో ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో మెప్పించలేదు.గోపాల…గోపాల – సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలు రెండు అంచనాలు అందుకోలేకపోయాయి.పవన్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు.
తమిళ్‌లో అజిత్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ వీరమ్ రీమేక్‌గా తెరకెక్కిన కాటమరాయుడు రిలీజ్‌కు ముందే భారీ హైప్ తెచ్చుకుంది.పవన్ సరసన శృతీహాసన్ నటించిన ఈ సినిమాకు గోపాల ఫేం డాలి దర్శకత్వం వహించారు.
ఈ రోజు రిలీజ్ అయిన కాటమరాయుడు పవన్‌కు బ్లాక్ బస్టర్ ఇచ్చిందా ? పవన్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిందో లేదో మన సమీక్షలో చూద్దాం.
కథలోకి వెళితే :
రాయలసీమలోని తాళ్లపాకలో కాటమరాయుడు తన నలుగురు తమ్ముళ్లతో కలిసి ఉంటాడు.ఆ ఊళ్లో అన్యాయం చేసే భూస్వామి రావూ రమేష్ నుంచి భూములు మొత్తం లాక్కుని ప్రజలకు ఇవ్వడంతో రావూ రమేష్ కాటమరాయుడిపై పగపట్టి కాటమరాయుడును అంతం చేసేందుకు వెయిట్ చేస్తుంటాడు.అమ్మాయిలకు ఆమడ దూరంలో ఉంటూ, ప్రేమంటే పడని కాటమరాయుడిని తమ ప్రేమ కోసం తమ్మళ్లందరూ కలిసి ఓ క్లాసికల్ డ్యాన్సర్ అయిన అవంతి (శృతిహాసన్) ప్రేమలో పడేలా చేస్తారు.
అవంతి ఫ్యామిలీకి గొడవలంటే ఇష్టం ఉండదు.ఊళ్లో గొడవల్లో ఆమె అన్న చనిపోవడంతో ఆమె తండ్రి నాజర్‌కు, అవంతి ఫ్యామిలీకి హింస అనే పదానికి దూరంగా ఉంటుంది.
అయితే కాటమరాయుడు తమ్ముళ్లు చెప్పిన మాటలు విన్న అవంతి శాంతి స్వరూపడని ప్రేమిస్తుంది.చివరకు కాటమరాయుడి నిజ స్వరూపం తెలుసుకుని తన ఊరు వెళ్లిపోతుంది.
అవంతి కోసం ఆమె ఊరు వెళ్లిన కాటమరాయుడు ఆమె తండ్రి నాజర్ వద్ద మంచి ఇంప్రెషన్‌తో వాళ్లింట్లోనే తన తమ్ముళ్లతో సహా తిష్టవేస్తాడు.అక్కడ నాజర్ ఫ్యామిలీని హతం చేసేందుకు భాను (తరుణ్ అరోరా) జైల్లో ఉండే స్కెచ్‌లు వేస్తుంటాడు.
అవంతి ఫ్యామిలీ ప్రమాదంలో ఉందన్న విషయం తెలుసుకున్న కాటమరాయుడు మరోసారి తనలోని పాత మనిషిని బయటకు తీసి ఆ గ్యాంగ్‌లను చంపేస్తుంటాడు.ఈ టైంలో కాటమరాయుడి గురించి నాజర్‌కు అసలు నిజం తెలుస్తుంది.
అసలు భానుకు నాజర్ ఫ్యామిలీకి శతృత్వం ఏంటి ? ఈ టైంలో ఎలసరి భాను ఏం చేశాడు ? ఫైనల్‌గా కాటమరాయుడు – అవంతి ఒక్కటయ్యారా ? అన్ ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ:
వీరమ్ సినిమాలోని తమ్ముళ్ల ప్రేమ కోసం అన్ననే ప్రేమలోకి దింపడం అనే మెయిన్ లైన్‌ను తీసుకున్న డాలి సినిమాలో చాలా మార్పులు, చేర్పులు చేశాడు.స్టోరీ అంతా మనకు తెలిసిందే ఉంటుంది.ఫస్టాఫ్ వరకు అంతా సరదా సరదాగా వెళ్లిపోతుంది.తమ్మళ్లు తమ ప్రేమ కోసం అన్నను ప్రేమలోకి దింపే సీన్లు బాగుంటాయి.ఈ క్రమంలో పవన్‌కు శృతికి మధ్య వచ్చే సీన్లలో కెమిస్ట్రీ బాగా కుదిరింది.
పవన్, శృతికి ప్రపోజ్ చేసే సీన్లు సూపర్బ్.కీలకమైన ఇంటర్వెల్ బ్యాంగ్‌ను మరింతగా ఎలివేట్ చేసే ఛాన్స్ ఉన్నా తేలిపోయింది.
సెకండాఫ్‌లో పవన్ శృతి కోసం వాళ్ల ఊరు వెళ్లడం అక్కడ ఆమె ఫ్యామిలీ ప్రమాదంలో ఉందని తెలుసుకుని వాళ్లను కాపాడడంతో కథ ఎండ్ అవుతుంది.ఫస్టాఫ్‌లో పవన్-శృతీ సీన్లు, కామెడీ, యాక్షన్, లైట్ రొమాన్స్‌తో సమపాళ్లలో బండిని నడిపించిన దర్శకుడు సెకండాఫ్‌లో చాలా వరకే కథనాన్ని తేల్చేశాడు.
స్క్రీన్‌ప్లే మ్యాజిక్ చేయలేదు.దీంతో సినిమా సాధారణ స్థాయికి పడిపోయింది.
క్లైమాక్స్ సైతం గతంలో చూసేసిన సినిమాలనే తలపించింది.ఇక బలహీనమైన విలనిజంతో హీరోయిజం తేలిపోయింది.
పవన్ తన శాయశక్తులా సినిమాను బాగానే లాగాడు.క్లాస్, మాస్ టచ్‌తో ఉండడం ఫ్లస్ అయ్యింది.
నటీనటుల పెర్ఫార్మెన్స్ :
పవన్ కళ్యాణ్ పంచెకట్టు అన్నగా అదరగొట్టాడు.పవన్ ఫస్ట్ టైం సినిమాలో ఎక్కువ టైం పంచెకట్టుతోనే కనిపించాడు.
కాటమరాయుడి గెటప్‌లో అటు లవ్ సీన్లలో క్లాస్‌ను ఇటు యాక్షన్‌తో మాస్‌ను మెప్పించాడు.ఇక శృతి అయితే గ్లామర్‌గా కనిపించిది.
పవన్ – శృతి మధ్య లవ్ సీన్లు, కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది.పాటల్లో శృతికి పొట్ట ఎక్కువైనట్టుగా కనిపించింది.
ఇక సినిమాలో రావూ రమేష్, ప్రదీప్‌సింగ్ రావత్, తరుణ్ అరోరా పేరుకు ముగ్గురు విలన్లు ఉన్నా ఏ ఒక్కరి క్యారెక్టర్ బలంగా లేకపోవడంతో విలనిజం తేలిపోయింది.రావూ రమేష్ శాడిస్ట్ విలనిజం వరస్ట్‌గా ఉంది.
పవన్ తమ్ముళ్లుగా చేసిన అజయ్, కమల్ కామరాజ్, శివబాలాజీ, కృష్ణచైతన్య క్యారెక్టర్లు సినిమా అంతా ట్రావెల్ చేసి కథలో కీలకమై హైలెట్ అయ్యాయి.శృతి తల్లిదండ్రులుగా చేసిన నాజర్, పవిత్రాలోకేష్ ఓకే.లింగబాబుగా ఆలీ, నాసా సైంటిస్ట్‌గా పృథ్వి చేసిన కామెడీ తుస్సుమంది.
టెక్నికల్ టీం :
సాంకేతికంగా ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీకి ముందుగా మంచి మార్కులు వేయాలి.సినిమాలో సీన్లు, సాంగ్స్ పిక్చరైజేషన్ బాగుంది.టెక్నికల్ టీంలో అనూప్ రూబెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు నూటికి నూటయాభై మార్కులు వేయాల్సిందే.థమన్ సాంగ్సే యావరేజ్‌గా ఉన్నాయి.ఆర్ ఆర్ ఎలా ఉంటుందో అని డౌట్ పడ్డ వాళ్ల మైండ్ బ్లాక్ అయ్యే రీతిలో ఆర్ ఆర్ ఇచ్చాడు.
గౌతంరాజు ఎడిటింగ్ మరో 10 నిమిషాలు ట్రిమ్ చేస్తే సినిమా మరింత స్పీడ్‌గా మూవ్ అయ్యేది.బ్రహ్మ కడలి ఆర్ట్ వర్క్ ఎలివేట్ అయ్యే స్కోప్ సినిమాలో లేదు.
రామ్, లక్ష్మణ్ ఫైట్స్ మాస్‌కు మాత్రమే ఎక్కుతాయి.
ప్లస్ పాయింట్స్ :
* పవన్ – శృతి కెమిస్ట్రీ
* సినిమాటోగ్రఫీ
* బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
* ఫస్టాఫ్
మైనస్ పాయింట్స్ :
* వీక్ డైరెక్షన్
* మెస్మరైజ్ చేయని స్క్రీన్ ప్లే
* ఇంటర్వెల్ బ్యాంగ్
* ప్లాట్ నెరేషన్
ఫైనల్ పంచ్: పవన్ ఫ్యాన్స్‌కే కాటమరాయుడు…కామన్ ఫ్యాన్స్‌కు మామూలు రాయుడే
తెలుగుస్టాప్ రేటింగ్ : 3.25 /5