నేను కడుపులో ఉన్నప్పుడే మా నాన్న అమ్మను వదిలేశాడు.. సీరియల్ హీరోయిన్ కన్నీళ్లు!

ఇండస్ట్రీలో అటు వెండి తెరపై ఇటు బుల్లితెరపై ఎంతోమంది నటీనటులు సీరియల్స్ లో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు.అయితే సీరియల్స్ లో, సినిమాల్లో నటించే నటీనటులకు రియల్ లైఫ్ లో కష్టాలు ఉండవు.

 Kasturi Serial Heroine Aishwaryaget Emotional In Star Maa Parivar League 3 Kastu-TeluguStop.com

ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు.కానీ అలా అనుకుంటే పొరపాటే.

ఎందుకంటే నవ్వుతూ కనిపించే నటీనటుల జీవితాలలో తెర వెనుక ఎన్నో కష్టాలు కన్నీళ్లు ఉంటాయి.వారు వెనుక ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ స్క్రీన్ ముందుకు వచ్చేసరికి అన్నీ మరిచిపోయి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధంగా ఉంటారు.

ఇదే విషయాన్ని ఇప్పటికీ ఎంతోమంది నటీనటులు కొన్ని సందర్భాలలో చెప్పిన విషయం తెలిసిందే.సీరియల్స్ లో నటించే కొందరు నటీనటుల జీవితాల వెనుక ఉన్నది కష్టాలు కన్నీళ్లు సీరియల్స్ కథలను తలపిస్తూ ఉంటాయి.

ఇదిలా ఉంటే తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న కస్తూరి సీరియల్ గురించి మనందరికీ తెలిసిందే.ఇందులో నటిస్తున్న హీరోయిన్ కస్తూరి అలియాస్ ఐశ్వర్య గురించి మనందరికీ తెలిసిందే.

తాజాగా ఈమె స్టార్ మా లో ప్రసారం అవుతున్న స్టార్ మా పరివార్ లీగ్ 3లో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే ఐశ్వర్య ఎమోషనల్ అవుతూ తన వ్యక్తిగత విషయం గురించి అభిమానులతో పంచుకుంటూ స్టేజీపైనే ఏడ్చింది .తన తండ్రి చేసిన మోసాన్ని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యింది.ఆమె కడుపులో ఉన్నప్పుడు ఆమె నాన్న తన తల్లిని వదిలేసి వెళ్ళిపోయాడు అని, ఇక అప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ, బయట లోకం అనే మాటలను భరిస్తూ ఈ స్టేజ్ కి వచ్చాము అని తెలిపింది.

సింగిల్ పేరెంట్ గా ఉంటే సమాజం ఎంత చిన్నచూపు చూస్తుందో, అలాంటి వారిని ఏ విధంగా మాట్లాడుతారో నాకు తెలిసిందే.అదే విషయం గురించి ఐశ్వర్య ప్రస్తావిస్తూ ఇష్టం లేకపోతే పెళ్లి ఎందుకు చేసుకోవాలి ఒక ఆడదాన్ని జీవితాన్ని ఎందుకు పాడు చేయాలి, దయచేసి మీకు ఇష్టముంటనే పెళ్లి చేసుకోండి ఇలా ఒక ఆడదాని జీవితాన్ని పాడు చేయకండి ప్లీజ్ అంటూ చేతులు జోడించి స్టేజీపైనే ఎమోషనల్ అయ్యింది ఐశ్వర్య.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube