యూకేకు చెందిన భారత సంతతి ప్రొఫెసర్( Indian Origin Professor )కు భారతదేశంలో చేదు అనుభవం ఎదురైంది.కర్ణాటక ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరు విమానాశ్రయానికి వచ్చిన ఆమెను ఎయిర్‌పోర్ట్‌లోనే అడ్డుకున్నారు.
లండన్‌లో నివసిస్తున్న కాశ్మీరీ పండిట్, విద్యావేత్త , ప్రొఫెసర్ నితాషా కౌల్ భారత్‌లో తనకు జరిగిన అనుభవాన్ని ఎక్స్‌లో పంచుకున్నారు. బెంగళూరు విమానాశ్రయం( Bangalore Airport )లో ఇమ్మిగ్రేషన్ అధికారులు తనకు ఎలాంటి కారణం చెప్పకుండానే అనుమతి నిరాకరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో ప్రవేశించడానికి అనుమతి లేదంటూ భారత ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి ముందస్తు సమాచారం కానీ నోటీసులు కానీ అందలేదని నితాషా పేర్కొన్నారు.

ఫిబ్రవరి 25, 25 తేదీలలో రెండు రోజుల పాటు జరిగిన ‘Constitution and National Unity Convention -2024′ని కర్ణాటక ప్రభుత్వం నిర్వహించింది.ఈ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వం నితాషా కౌల్‌ను ఆహ్వానించింది.సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో వున్న బయోను బట్టి చూస్తే.
కౌల్ నవలా రచయిత్రి.ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడినందుకు తనకు భారతదేశంలోకి ప్రవేశం నిరాకరించారని కౌల్ వెల్లడించారు.
కర్ణాటక ప్రభుత్వం (కాంగ్రెస్ పాలిత రాష్ట్రం)( Karnataka Govt ) గౌరవప్రదమైన ప్రతినిధిగా తనను సమావేశానికి ఆహ్వానించింది.కానీ కేంద్రం తనకు ప్రవేశాన్ని నిరాకరించిందని, తన పత్రాలన్నీ చెల్లుబాటు అయ్యేవేనని, ప్రస్తుతం తన వద్ద యూకే పాస్‌పోర్ట్ , ఓసీఐ కార్డ్ వున్నాయని నితాషా కౌల్( Nitasha Kaul ) తెలిపారు.
కర్ణాటక ప్రభుత్వంతో పాటు ఇతర కాన్ఫరెన్స్ సంబంధిత కమ్యూనికేషన్‌లు తనకు అందజేసిన ఆహ్వానపత్రాలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.

గతంలో ఆర్ఎస్ఎస్( RSS )ను విమర్శించినందుకు తనకు భారత్‌లోకి ప్రవేశం నిరాకరించినట్లు అధికారులు అనధికారంగా తనతో చెప్పారని కౌల్ ట్వీట్‌లో పేర్కొన్నారు.ఈ పరిణామానికి కర్ణాటక బీజేపీ( BJP ) విభాగం కౌంటరిచ్చింది.నితాషా కౌల్ ‘Break India Brigade’ అని, పాకిస్తాన్ సానుభూతిపరురాలు అని.వ్యాఖ్యానించింది.కౌల్, కర్ణాటక బీజేపీ ఇద్దరూ బెంగళూరు విమానాశ్రయంలో స్టేషన్ మాస్టర్.
బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు పంపిన పత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.ఇందులో ఆమె భారతదేశంలో అడుగుపెట్టేందుకు అనుమతిని నిరాకరించినట్లుగా తెలిపారు.