క్యాపిటల్ హిల్‌పై దాడి : జనవరి 6 నాటి ఫోన్ రికార్డులను డిలీట్ చేసిన వ్యక్తుల్లో ‘‘ కాష్ పటేల్’’

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం 2020 జనవరి 6న యూఎస్ కాంగ్రెస్.క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.

 Kash Patel Among Trump's Team Whose Phone Records Related To Attack On Capitol W-TeluguStop.com

ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.

బారికేడ్లను దాటుకుని మరి వచ్చి కిటికీలు, ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు.వారిని శాంతింపజేసేందుకు తొలుత టియర్ గ్యాస్ ప్రయోగించినప్పటికీ లాభం లేకపోయింది.

దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు తూటాలకు పనిచెప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటనకు సంబంధించి యూఎస్ కాంగ్రెస్‌ సభ్యులతో కూడిన స్వతంత్ర కమిటీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మాజీ పెంటగాన్ అధికారి, హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీకి సుదీర్ఘ కాలం సహాయకుడిగా పనిచేసిన భారత సంతతికి చెందిన కశ్యప్ ‘‘కాష్’’ పటేల్‌తో సహా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేసిన మరికొందరు సీనియర్ సభ్యులు వారి ఫోన్‌ల నుంచి టెక్ట్స్‌ సందేశాలను డిలీట్ చేశారని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్, యూఎస్ ఆర్మీ.కోర్టులో పత్రాలు దాఖలు చేశాయి.

ఈ తొలగించబడిన సందేశాలు యూఎస్ క్యాపిటల్‌పై జనవరి 6న జరిగిన దాడులకు ముందు దానికి దారి తీసిన సంఘటనలను చూపుతాయని సదరు పత్రాల్లో తెలిపారు.

ఆగస్ట్ 2, 2022న రక్షణ శాఖ న్యాయవాదులు … డిఫెన్స్ తాత్కాలిక కార్యదర్శి పటేల్‌తో సహా అప్పటి సీనియర్ అధికారుల నుంచి జనవరి 6 సంబంధిత ఫోన్ రికార్డ్‌లను కోరుతున్నట్లు ధృవీకరించారు.

కోర్టులో దాఖలు చేసిన పత్రాల ప్రకారం.ఈ ముగ్గురు అధికారులు జనవరి 6న జరిగిన క్యాపిటల్ హిల్ దాడులపై ప్రభుత్వ ప్రతిస్పందనలో కీలకపాత్ర పోషించారు.

యూఎస్ క్యాపిటల్‌‌పై దాడుల సమయంలో పెంటగాన్ ఉన్నత అధికారిగా మార్క్ టీ ఎస్పర్ స్థానంలో మిల్లర్‌ను ట్రంప్ నియమించగా.ఆయనకు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పటేల్ పనిచేశారు.

Telugu Defense Profile, Joe Biden, Kashpatel, Patelstaff-Telugu NRI

పటేల్ తన హోదాలో సెక్రటరీ మిషన్‌ను విజయవంతం చేయడానికి బాధ్యత వహించాడు.డిపార్ట్‌మెంట్ కార్యకలాపాలకు సంబంధించిన అన్ని విషయాలపై సెక్రటరీ , అతని ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి సలహా ఇచ్చే బాధ్యత కూడా ఆయనదే.అల్లర్లు జరిగిన రోజున వైట్‌హౌస్ మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్‌తో పటేల్‌ నిరంతర సంప్రదింపులు జరిపాడు.రక్షణ శాఖ అందించిన పత్రాల ప్రకారం.ఆయన క్యాపిటల్ వద్ద భద్రతకు సంబంధించి దాడికి ముందుకు, దాడి సమయంలో సీనియర్ పెంటగాన్ అధికారుల మధ్య చర్చలలో కూడా పాల్గొన్నాడు.

ఇకపోతే.

పటేల్ న్యూయార్క్‌కు చెందినవారు.యునైటెడ్ కింగ్‌డమ్‌లోని యూనివర్సిటీ కాలేజ్ , లండన్ ఫ్యాకల్టీ ఆఫ్ లాస్ నుంచి ఇంటర్నేషనల్ లాలో సర్టిఫికేట్‌, అంతకుముందు రిచ్‌మండ్ విశ్వవిద్యాలయంలో ఆయన తన అండర్ గ్రాడ్యుయేట్ అధ్యయనాలను పూర్తి చేశారు.

పెంటగాన్‌లో చేరడానికి ముందు .అమెరికా అధ్యక్షుడికి డిప్యూటీ అసిస్టెంట్‌గా, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎన్ఎస్‌సీ)లో కౌంటర్ టెర్రరిజం సీనియర్ డైరెక్టర్‌గా సేవలందించారు.అతని డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొఫైల్ ప్రకారం.నేషనల్ ఇంటెలిజెన్స్ యాక్టింగ్ డైరెక్టర్‌కు ప్రిన్సిపల్‌ డిప్యూటీగా కూడా పనిచేశారు.ఈ హోదాలో ఆయన 17 ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ ఏజెన్సీల కార్యకలాపాలను పర్యవేక్షించడంతో పాటు అధ్యక్షుడి రోజువారీ బ్రీఫింగ్‌ను అందించేవారు.కాగా.

జనవరి 6న క్యాపిటల్ దాడులు జరిగిన ఒకరోజు తర్వాత.దాడుల సమయంలో క్యాపిటల్‌లో నేషనల్ గార్డ్‌ను మోహరించడానికి ట్రంప్ విముఖతను పటేల్ ఖండించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube