కార్తికేయ2 సినిమా ప్లస్, మైనస్ లు ఇవే.. ఏకంగా బాహుబలి సినిమాతో పోలుస్తూ?

నిఖిల్ హీరోగా చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన కార్తికేయ2 సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.ఈ వారం థియేటర్లలో విడుదలైన లాల్ సింగ్ చడ్డా, మాచర్ల నియోజకవర్గం సినిమాలు ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే.కార్తికేయ2 సినిమాపైనే సినీ అభిమానులు ఆశలు పెట్టుకోగా ఈ సినిమా ఆ ఆశలను నెరవేర్చే విధంగానే ఉంది.ఎక్కువమంది ఈ సినిమా గురించి పాజిటివ్ గా చెబుతుండగా కొంతమంది మాత్రం కార్తికేయ2 సినిమా గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

 Karthikeya2 Movie Plus And Minus Points Details Here Goes Viral ,karthikeya2, Ni-TeluguStop.com

30 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా కార్తికేయ సినిమాకు సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 12.80 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.కార్తికేయ2 మూవీ డివోషనల్ గా సాగే మిస్టరీ మూవీ కాగా చందూ మొండేటి స్క్రీన్ ప్లే రేసీగా ఉండే విధంగా ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నారని సమాచారం అందుతోంది.విజువల్ ఎఫెక్ట్స్ కు సంబంధించిన సన్నివేశాలతో నెక్స్ట్ లెవెల్ లో ఈ సినిమా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.డివోషనల్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.

క్లైమాక్స్ ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ద్వారక నగరాన్వేషణను ఈ సినిమాలో చక్కగా చూపించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బాహుబలి సీక్వెల్ బాహుబలి2 ఏ స్థాయిలో మెప్పించిందో కార్తికేయ సీక్వెల్ కార్తికేయ2 కూడా అదే స్థాయిలో మెప్పించిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Biggest, Chandoo Mondeti, Karthikeya, Nikhil, Tollywood-Movie

కార్తికేయ2 సినిమా డిఫరెంట్ సినిమా అని ఈ సినిమాను కార్తికేయ సినిమాతో పోల్చి చూడటం కరెక్ట్ కాదని మరి కొందరు చెబుతున్నారు.క్లైమాక్స్, యాక్షన్ సన్నివేశాలు, బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్లు కాగా సెకండాఫ్, లాజిక్ లేని సన్నివేశాలు ఈ సినిమాకు మైనస్ అయ్యాయని తెలుస్తోంది. నిఖిల్ ఖాతాలో మరో సక్సెస్ చేరడంతో ఆయన అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube