కార్తీకదీపం సీరియల్తో బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో దగ్గర అయిపోయాడు కార్తీక్ అయితే ఇతని అసలు పేరు నిరుపమ్ పరిటాల.కార్తీక్ బాబు సీరియల్ లో ఎలాగయితే దీపను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడో, రియల్ లైఫ్లో కూడా మంజులను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు మంజుల కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అవ్వడం విశేషం.
అప్పట్లో ఈటీవీ లో ప్రసారమయ్యే చంద్రముఖి సీరియల్ కార్తీక్ తో పాటు నటించింది.అసలు వీళ్ళ ప్రేమ కథ ఎలా మొదలైంది ? ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం మంజుల ఓ కన్నడ నటి.పుట్టిపెరిగింది బెంగుళూరులో కన్నడ బ్యాగ్రౌండ్.అసలు తాను ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టిందంటే తన చెల్లికీర్తి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి, కన్నడ సినిమాలో హీరోయిన్ గా కూడా చేసింది.
అలా తనకు సీరియల్స్ లో ఆఫర్ రావడంతో సీరియల్స్ ద్వారా కెరియర్ మొదలుపెట్టింది..
తెలుగుతో చంద్రముఖి ద్వారా పరిచయం అయింది.చంద్రముఖి సీరియల్ లో దాదాపు ఆరున్నరేళ్లు పాటు చేశా ఆ సీరియల్ పరిచయంతోనే నిరుపమ్, మంజుల ఇద్దరు క్లోజ్ అయ్యారు.అలాగే వాళ్లు ఇద్దరు కూడా చాలా సైలెంట్ గా ఉంటారట షూటింగ్ లో కూడా ఇద్దరు చాలా తక్కువ మాట్లాడుకునేవాళ్లరట అలాగే మీరు ఎప్పుడన్నా మంజుల చేతి మీద ఉన్న టాటూ గమనించార ? తన చేతిపై నిరుపమ్ టాటూ ఉంటుంది.మంజులకి టాటూ మీద ఉన్న ఇష్టంతో నిరుపమ్ టాటూ వేయించుకున్నదట .
అసలు వాళ్ళ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యిందంటే చంద్రముఖి సీరియల్ వాళ్ళ ఇద్దరికీ ఫస్ట్ సీరియల్.మొదట్లో మంజులకి తెలుగు రాక చాలా ఇబ్బంది పడిందట భాష రాకపోవడంతో పెద్దగా ఎవరితోనూ మాట్లాడేది కాదట.
తరువాత ఆ సీరియల్ చేస్తున్నప్పుడు ఒక ఏడాది వరకూ ఇద్దరు కూడా ఫోన్ నంబర్లు కూడా తీసుకోలేదు ఏడాది తరువాత మంజుల నిరుపమ్ ని అడిగి నెంబర్ తీసుకున్నది.

ఆ తరువాత నుంచి హాయ్ హలో అని మాట్లాడుకుంటూ అలా ఫ్రెండ్షిప్ మొదలై పెళ్లి వరకూ వెళ్లింది.మొదట కార్తీక్ నే మంజులకి లవ్ ప్రొపోజ్ చేసాడట అలాగే ఎప్పుడైతే కార్తీక్ లవ్ ప్రపోజ్ చేశారో అప్పటి నుంచి వాళ్ళ కాంబినేషన్ సీరియల్స్ తగ్గిపోయాయి.అయితే వీరిద్దరి ప్రేమ గురించి నిరుపమ్ వాళ్ళ అమ్మగారికి తెలిసిపోయింది.
మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అని చెప్పడంతో ఒకసారి ఇంటికి తీసుకునిరా మాట్లాడదాం అన్నారట.నిరుపమ్ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళ ప్రేమను ఇంట్లో అంగీకరించారు.
మంజుల ఇంట్లోకూడా నిరుపమ్ గురించి తెలియడంతో నో అని చెప్పలేదు.ఆ తరువాత పెద్దల అంగీకారంతో ఇద్దరు పెళ్లి అనే బంధంతో ఒక్కటి అయ్యారు.
ఇప్పుడు ఈ జంటకి ఒక బాబు కూడా ఉన్నాడు.ఇదండీ మన డాక్టర్ బాబు సక్సెస్ ఫుల్ లవ్ స్టోరీ.
.