బాలీవుడ్ లో సుశాంత్ ని గుర్తు చేస్తున్న కార్తిక్ ఆర్యన్

బాలీవుడ్ లో బ్యాగ్రౌండ్ లేని హీరోలకి అంత వేగంగా సక్సెస్ రాదని చాలా మంది విశ్వాసం.ఏదో ఒక బ్యాగ్రౌండ్ ఉన్న వారికే బాలీవుడ్ లో నిర్మాతల నుంచి అవకాశాలు లభిస్తాయని, ప్రోత్సాహం ఉంటుందని చాలా మంది విమర్శలు చేస్తూ ఉంటారు.

 Kartik Aaryan Has Dropped Out Of Ajay Bahl's Red Chillies Film, Tollywood, Bolly-TeluguStop.com

కంగనా రనౌత్ అయితే ఈ విషయాన్ని చాలా బలంగా చెబుతుంది.సుశాంత్ మృతికి కూడా కారణం బాలీవుడ్ లో ఈ రకమైన మాఫియానే అని పేర్కొంది.

నెపోటిజం చుట్టూనే బాలీవుడ్ సినిమా తురుగుతుందనే విమర్శలు పదే పదే వినిపిస్తూనే ఉంటాయి.హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్స్ విషయంలో కూడా నెపోటిజం బాలీవుడ్ లో ఎక్కువగా పని చేస్తుందని అంటూ ఉంటారు.

ఇప్పుడు యువ హీరో కార్తిక్ ఆర్యాన్ విషయంలో కూడా బాలీవుడ్ లో వారసత్వం అనేది ఇబ్బందికరంగా మారిందని టాక్ వినిపిస్తుంది.ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలతో వరుస హిట్స్ అందుకుంటూ కార్తీక్ ఆర్యాన్ ఫేమ్ తెచ్చుకున్నాడు.

అయితే ఇప్పుడు ఇతనికి కొంత మంది నిర్మాతలు అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ అర్ధంతరంగా ఏవో కారణాలు చూపిస్తూ తప్పిస్తున్నారని సమాచారం.

సుశాంత్ కెరియర్ మంచి జోరు మీద ఉన్న సమయంలోనే కొంత మంది నిర్మాతలు అతనితో ఒప్పందం చేసుకొని తరువాత అతన్ని తప్పించి వేరొక హీరోని తీసుకున్నారు.

ఇలా 6 పెద్ద ప్రాజెక్ట్స్ ని అతను కోల్పోయాడు.తీసుకున్న అడ్వాన్స్ లని కూడా తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది.అతను వదులుకున్న ఆరు పెద్ద సినిమాలలో వారసత్వం బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలు నటించడంవిశేషం.ఇప్పుడు అదే విధానం కార్తీక్ ఆర్యన్ విషయంలో కూడా జరుగుతుందని ప్రచారం తెరపైకి వచ్చింది.

కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో దోస్తానా2 నుంచి కార్తీక అర్యాన్ ని అర్ధంతరం గా తప్పించడం జరిగింది.తాజాగా షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ రెడ్ చిల్లీస్ బ్యానర్ పై అజయ్ బెల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా నుంచి అతను అర్ధంతరంగా తప్పుకున్నాడు.

రెండేళ్ళ క్రితమే ఈ సినిమాకి సైన్ చేశాడు.అయితే తనకి మొదటిగా చెప్పిన స్టొరీలైన్ ప్రస్తుతం ఉన్న కథ పూర్తి విరుద్ధంగా ఉందని అతను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది.

ఇక సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేసాదని సమాచారం.ఇలా తప్పుకోవడం వలన కార్తీక్ ఆర్యాన్ పై బిటౌన్ లో ఒక దుష్ప్రచారం కూడా మొదలు పెట్టారు.

మరి ఈ యంగ్ హీరో కెరియర్ కూడా సుశాంత్ లానే మారుతుందా లేదంటే సక్సెస్ అవుతాడా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube