అల వైకుంఠపురంలో హిందీ రీమేక్ లో హీరోగా కార్తీక్ ఆర్యన్

గత కొంత కాలంగా తెలుగు సినిమాలు హిందీలోకి ఎక్కువ సంఖ్యలో రీమేక్ అవుతున్నాయి.అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంటున్నాయి.

 Kartik Aaryan To Star In Ala Vaikunthapurramuloo Remake, Trivikram Srinivas, All-TeluguStop.com

చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా తర్వాత సౌత్ ఇండియన్ మాస్ ఎలిమెంట్స్ కి హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.దీంతో తెలుగు, తమిళ సినిమాలు హిందీలో కూడా సందడి చేస్తున్నాయి.

ఇక సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ అయితే పూర్తిగా సౌత్ మాస్ ఫార్ములా కథలతోనే వరుస హిట్స్ కొడుతున్నారు.ఇక కుర్ర హీరోలు కూడా సౌత్ సినిమాలపై మోజు పెంచుకుంటున్నారు.

ఈ నేపధ్యంలో తెలుగులో సూపర్ హిట్ సినిమాలు హిందీలో విపరీతంగా రీమేక్ అవుతున్నాయి.తాజాగా అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అల వైకుంఠపురంలో సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

స్టైలిష్ గా, ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో నిండి ఉండే ఈ సినిమా కథ హిందీ ప్రేక్షకులకి చేరువ అవుతుందని రీమేక్ చేస్తున్నారు.

హిందీ రీమేక్‌లో అల్లు అర్జున్‌ చేసిన పాత్రను కుర్ర హీరో కార్తీక్‌ ఆర్యన్‌ చేయబోతున్నారు.

దేశీ బాయ్స్, డిష్యూం చిత్రాలను తెరకెక్కించిన రోహిత్‌ ధావన్‌ ఈ సినిమాను డైరెక్ట్‌ చేయనున్నారు.ఏక్తా కపూర్‌తో కలసి అల్లు అరవింద్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది.త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు అంటే ఎక్కువగా ఫ్యామిలీ ఎమోషన్స్, సౌత్ నేటివిటీతో ఉంటాయి.

అందుకే ఇప్పటి వరకు అతని సినిమాలు హిందీలోకి వెళ్ళలేదు.అయితే ఇప్పుడు అల సినిమాని అల్లు అరవింద్ ధైర్యం చేసి హిందీలో రీమేక్ చేస్తున్నాడు.

ఈ సినిమా హిట్ అయితే త్రివిక్రమ్ ఫార్ములాకి హిందీలో కూడా ఫ్యాన్స్ పెరిగే అవకాశం ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube