అల వైకుంఠపురంలో సినిమాపై మనసు పడిన బాలీవుడ్ కుర్ర హీరో  

Kartik Aaryan Interested To Act Ala Vaikuntapuramlo Remake, Tollywood, Allu Arjun, Bollywood, Bunny, South Cinema - Telugu Allu Arjun, Bollywood, Bunny, Kartik Aaryan Interested To Act Ala Vaikuntapuramlo Remake, South Cinema, Tollywood

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ హీరోగా వచ్చిన సినిమా అల వైకుంఠపురంలో.ఈ సినిమా బన్నీ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా కూడా నిలిచింది.

 Kartik Aaryan Ala Vaikuntapuramlo Bollywood

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి.అర్జున్ రెడ్డి రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న నిర్మాణ సంస్థ ఈ సినిమా రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు.

ఇక ఇందులో హీరోగా కుర్ర హీరోలలో ఒకరిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.ఎక్కువగా షాహిద్ కపూర్ పేరు వినిపిస్తుంది.

అల వైకుంఠపురంలో సినిమాపై మనసు పడిన బాలీవుడ్ కుర్ర హీరో-Movie-Telugu Tollywood Photo Image

అయితే ఒక కుర్ర హీరో మాత్రం అల సినిమాపై విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నాడు.

ఈ రీమేక్ ను నేనే చేస్తేనే కరెక్ట్ అని అంటున్నాడు.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎంటర్టైనర్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్స్ గా మారిన నటుడు కార్తీక్ ఆర్యన్.తాజాగా ఆయన అల వైకుంఠ పురంలో సినిమాపై ఆసక్తి చూపిస్తున్న విషయాన్ని మీడియాతో పంచుకున్నాడు.

నెట్ ఫ్లిక్స్ లో నేను అల వైకుంఠపురములో’ చిత్రం చూసాను.ఆ చిత్రం చూశాక హిందీ రీమేక్ లో ఎట్టి పరిస్థితుల్లో నేనే నటించాలని ఫిక్స్ అయిపోయాను.

అల్లు అర్జున్ పాత్రలో నన్ను తప్ప ఇంకొకరిని ఊహించుకోలేకపోతున్నాను అంటూ కార్తీక్ ఆర్యన్ చెప్పుకొచ్చాడు.దర్శకుడు రోహిత్ ధావన్ ఈ చిత్రాన్ని హిందీలో డైరెక్ట్ చేయబోతున్నట్టు టాక్ నడుస్తుంది.

అయితే ఈ రీమేక్ లో నటించడానికి కార్తీక్ ఆర్యన్ ఇప్పటికే నిర్మాత, దర్శకుడుతో కనెక్ట్ అయినట్లు తెలుస్తుంది.మరి వాళ్ళు అల కోసం కార్తీక్ ని తీసుకుంటారా లేదా అనేది కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kartik Aaryan Ala Vaikuntapuramlo Bollywood Related Telugu News,Photos/Pics,Images..