ఆమె పంపిన మెసేజ్ వల్ల ఇంట్లో గొడవలు.. కాబోయే భార్యపై కార్తికేయ కామెంట్స్?

అజయ్ భూపతి దర్శకత్వంలో ఆర్ఎక్స్ 100 చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన హీరో కార్తికేయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకొని వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో త్వరలోనే తన బ్యాచిలర్ లైఫ్ కి ఫులి స్టాప్ పెట్టనున్నారు.

 Karthikeyans Comments On His Fianc Karthiykeyan, Comment, Fianc, Message , Lohit-TeluguStop.com

తాను కాలేజీ చదివే రోజుల్లో లోహిత అనే అమ్మాయిని ప్రేమించానని తననే పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొద్ది రోజుల క్రితం ఈ హీరో వెల్లడించారు.

ఈ క్రమంలోనే తన ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి వారినీ పెళ్లికి ఒప్పించారు.

ఇలా 10 సంవత్సరాలపాటు ప్రేమలో ఉన్న ఈ జంట కార్తికేయ ప్రేమను ఒప్పుకోవడానికి తనకు సంవత్సరకాలం పట్టిందని ఈ సందర్భంగా హీరో తెలియజేశారు.తాను బీటెక్ చదువుతున్న రోజుల్లో ఒకరోజు లోహిత తనకు మెసేజ్ పంపిందని అయితే ఆ మెసేజ్ కారణంగా ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని ఈ సందర్భంగా కార్తికేయ వెల్లడించారు.

అయితే ఆ మెసేజ్ నిజం కాదని అప్పటికి సర్ది చెప్పినప్పటికీ ఆ రోజు ఆ మెసేజ్ చేసింది లోహిత అని తాజాగా తమ కుటుంబ సభ్యులకు తెలిసిందని చెప్పారు.

Telugu Rx, Fianc, Karthiykeyan, Lohitha, Message, Raja Vikramarka, Tollywood-Mov

పది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న మూడు నెలల క్రితమే మా ప్రేమ విషయం ఇంట్లో చెప్పామని ముందుగా మా ఇంట్లో ఒప్పించి ఆ తర్వాత లోహిత కుటుంబ సభ్యులని ఒప్పించానని కార్తికేయ తెలిపారు.ఇక తాజాగా రాజావిక్రమార్క రిలీజ్ వేడుకలో భాగంగా వేదికపైనే తనకి ప్రపోజ్ చేయడం గురించి మాట్లాడుతూ ఆ ప్రపోజల్ ను తన జీవితాంతం గుర్తు పెట్టుకుంటుందని అందుకోసమే అలా ప్రపోజ్ చేశానని తెలిపారు.ఇక ఈ నెలలోనే కార్తికేయ లోహిత పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కార్తికేయ ఒక సందర్భంలో వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube