'రాజా విక్రమార్క' టీజర్ రిలీజ్.. NIA అధికారిగా కార్తికేయ !

టాలీవుడ్ యంగ్ హీరోల్లో కార్తీకేయ ఒకరు.ఈయన RX100 సినిమాతో తెలుగు తెరకు పరిచయ మయ్యి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు.

 ‘రాజా విక్రమార్క’ టీజర్ రి-TeluguStop.com

ఈ సినిమా హిట్ అవ్వడంతో కార్తికేయకు వరుస అవకాశాలు వచ్చాయి.ప్రెసెంట్ కార్తికేయ ‘రాజా విక్రమార్క’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అయ్యాడు.

ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.

శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.తాజాగా రాజా విక్రమార్క సినిమా నుండి టీజర్ విడుదల అయ్యింది.

ఇప్పటికే విడుదల అయినా ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ ఆడియో, ప్రచార చిత్రాలు అన్ని కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి.ఈ సినిమాపై అంచనాలను కూడా పెంచేసాయి.

తాజాగా విడుదల అయినా టీజర్ కు కూడా మంచి స్పందన వస్తుంది.

ఈ సినిమాలో కార్తికేయ NIA అధికారిగా నటిస్తున్నాడు.ఆయన చేసే సీక్రెట్ మిషన్ లో ఒక నైజీరియన్ ని అనుకోకుండా కాల్చి చంపినట్టు ఈ టీజర్ లో దర్శకుడు చూపించాడు.ఈ టీజర్ ఆద్యంతం యాక్షన్ తో పాటు ఉత్కంఠగా సాగిపోయింది.

చిన్నప్పుడు కృష్ణ గారిని చూసి ఆవేశపడి జాబ్ లో జాయిన్ అయ్యా కానీ జాయిన్ అయినా తర్వాత సరదా తీరిపోతుంది.ఇక నా వల్ల కాదు అంటూ కార్తికేయ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులకు బాగా నచ్చింది.

ఇక ఈ సినిమాలో కార్తికేయ లుక్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది.NIA అధికారిగా కనిపించడం కోసం మంచి వర్కౌట్స్ చేసి బాడీని ఫిట్ గా మార్చేశాడు.ఈ టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా అలరిస్తుంది.ఇక ఈ సినిమాలో కార్తికేయపై జోడీగా తాన్యా రవిచంద్రన్ నటిస్తుంది.శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై టి.ఆదిరెడ్డి సమర్పణలో రామారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తుండగా.ప్రశాంత్ ఆర్ విహారి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube