'రాజా విక్రమార్క' ఫస్ట్ సింగిల్..ఆసక్తి పెంచుతున్న థీమ్ సాంగ్!

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన కార్తీకేయ తన నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.RX100 సినిమాతో తెలుగు తెరకు పరిచయ మయ్యి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా హిట్ అవ్వడంతో కార్తికేయకు వరుస అవకాశాలు వచ్చాయి.నటన, అందం, డాన్స్ పరంగా కూడా సూపర్ అనిపించుకోవడంతో ఈ యంగ్ హీరోకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి.

 Karthikeya Raja Vikramarka Movie First Single Released , Karthikeya, Raja Vikram-TeluguStop.com

ప్రస్తుతం కార్తికేయ ‘రాజా విక్రమార్క‘ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అయ్యాడు.శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాను ఇన్వెస్టిగేషన్ త్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఇక ఈ సినిమా నుండి చిత్ర యూనిట్ ఈ మధ్యనే టీజర్ ను విడుదల చేసింది.ఈ టీజర్ ఆద్యంతం త్రిల్లింగ్ గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఈ సినిమాలో కార్తికేయ NIA అధికారిగా నటిస్తున్నాడు.ఈ సినిమాలో తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా కనిపిస్తుంది.ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు.ఇక తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

రాజా గారు బయటకొస్తే.అంటూ సాగిన ఈ సాంగ్ వినడానికి చాలా బాగుండడమే కాకుండా మంచి ఎనేర్జిటిక్ ఫీల్ ను ఇచ్చింది.

ఈ థీమ్ సాంగ్ కు మంచి లిరిక్స్ తో పాటు స్పెషల్ ర్యాప్ తో ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.ఈ సాంగ్ మొత్తం కార్తికేయ నటిస్తున్న ఎన్ఐఏ ఆఫీసర్ పాత్ర గురించి తెలుపుతుంది.ఈ సినిమా త్వరలోనే థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అందుకే ఈ సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేయడానికి వరుస అప్డేట్ లతో చిత్ర యూనిట్ ప్రోమోట్ చేస్తుంది.

ఇక ఈ సినిమాను శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై టి.ఆదిరెడ్డి సమర్పణలో రామారెడ్డి నిర్మిస్తున్నారు.

https://youtu.be/sgoTWbLMTi0
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube