మల్టీస్టారర్ సినిమా చేయడానికి రెడీ అయిన యంగ్ హీరో ?

Rx 100 సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో.కార్తికేయ ఈ సినిమాలో చేసిన నటనకు చాలా మంది అభిమానులు ఫిదా అయ్యారనే చెప్పాలి.

 Karthikeya Next To Act In Multi Starrer Movie-TeluguStop.com

ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి సంచలనం సృష్టించింది.ఈ సినిమా తర్వాత కార్తికేయ వరస సినిమాలు చేస్తూ బిజీ అయ్యాడు.

హీరోగా మాత్రమే కాకుండా మంచి పాత్రలు వస్తే ఎలాంటి క్యారెక్టర్ అయినా చేసేందుకు రెడీగా ఉన్నాడు.

 Karthikeya Next To Act In Multi Starrer Movie-మల్టీస్టారర్ సినిమా చేయడానికి రెడీ అయిన యంగ్ హీరో -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా నటించి తనకంటూ ప్రత్యేక మైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈ పాత్రతో ప్రేక్షకులను మరొకసారి మెప్పించాడు.తాజాగా కార్తికేయ నటించిన చావు కబురు చల్లగా సినిమా విడుదల అయ్యింది.

ఈ సినిమా కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో తెరకెక్కింది.ఇందులో కార్తికేయకు జోడీగా లావణ్య త్రిపాఠి నటించింది.

అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేక చతికల పడింది.ప్రస్తుతం కార్తికేయ తమిళంలో వలిమై సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో అజిత్ హీరోగా నటిస్తున్నాడు.ఇందులో నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు.ఈ రోల్ కు చాలా ఇంపార్టెన్స్ ఉండండతో ఈ యంగ్ హీరోను ఈ ఆఫర్ వరించింది.ఈ ఛాన్స్ రావడంతో తమిళంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తికేయ.

తాజాగా ఈ యంగ్ హీరో ఒక మల్టీ స్టారర్ మూవీలో నటించబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఈ మల్టీ స్టారర్ సినిమాలో హీరోగా మెయిన్ రోల్ చేస్తున్నాడా లేదంటే విలన్ గా కనిపించబోతున్నాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

అధికారిక ప్రకటన వస్తే కానీ అసలు విషయం తెలియదు.ఇవే కాకుండా కార్తికేయ సరిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాకు స్టోరీ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ సుకుమార్ అందిస్తున్నాడు.

#YoungHero #Karthikeya #MultiStarrer #Ajith

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు