బస్తీ బాలరాజు గా ఆర్ఎక్స్ 100 హీరో...  

Karthikeya New Movie Chavu Kaburu Challaga Shooting Began - Telugu Chavu Kaburu Challaga, Chavu Kaburu Challaga Movie News, Chavu Kaburu Challaga Shooting Updat, Karthikeya, Karthikeya Movie News, Tollywood Actor Karthikeya

అజయ్ భూపతి దర్శకత్వం వహించిన టువంటి ఆర్ఎక్స్100 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి హీరో కార్తికేయ తనదైన శైలిలో విభిన్న కథనాలు ఎంచుకుంటూ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు.అయితే ప్రస్తుతం కార్తికేయ “చావు కబురు చల్లగా” అనే చిత్రంలో నటిస్తున్నాడు.

Karthikeya New Movie Chavu Kaburu Challaga Shooting Began

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కౌశిక్ దర్శకత్వం వహిస్తుండగా గీతా ఆర్ట్స్2 బ్యానర్  బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించినటువంటి కార్తీకేయ ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.

ఈ పోస్టర్ ని బట్టి చూస్తుంటే కార్తికేయ మరో మాస్ యాంగిల్ కలిగినటువంటి బస్తీ బాలరాజు అనే బస్తీ యువకుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ చిత్రంలో కార్తికేయ సరసన టాలీవుడ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాటి నటిస్తోంది.

అంతేగాక శవాలను తీసుకెళ్లే వాహనంపై నిల్చొని స్టైల్ గా బీడీ కాలుస్తూ ఇచ్చిన పోజుకి మాస్ ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారు.ఈ చిత్రం హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా జరుపుకుంటోంది.

అయితే ఇది ఇలా ఉండగా కార్తికేయ ఇటీవల కాలంలో నటించినటువంటి 90 ఎం.ఎల్ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.దీంతో మరోసారి కార్తికేయ మాస్ పాత్రలో కనిపించి మెప్పించనున్నాడు.అయితే ఒక పక్క హీరో పాత్రలు చేస్తూనే మరో పక్క విలన్ పాత్రలో నటిస్తున్నాడు.ఇందులో భాగంగా ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ అజిత్ సినిమాలో విలన్గా నటించే అవకాశం దక్కించుకున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Karthikeya New Movie Chavu Kaburu Challaga Shooting Began Related Telugu News,Photos/Pics,Images..

footer-test