మన కుర్ర హీరోను ఎక్కడో ఉంచిన తమిళ సూపర్‌ స్టార్‌

యంగ్‌ హీరో కార్తికేయ ఆర్‌ ఎక్స్ 100 సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత వరుసగా హీరో గానే కాకుండా విలన్ పాత్రల్లో కూడా నటిస్తూ మెప్పిస్తూ వస్తున్నాడు.

 Karthikeya First Look In Ajith Valimai Movie-TeluguStop.com

ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమా ల విషయానికి వస్తే తెలుగు లో హీరో గా రెండు సినిమా లు చేస్తున్నాడు.ఇదే సమయంలో ఈయనకు తమిళ సూపర్‌ స్టార్‌ అజిత్ మూవీ వాలిమై లో కూడా కీలక పాత్ర దక్కింది.

సాదారణంగా ఇతర భాష నటుడు అది కూడా ఒక చిన్న హీరో కు పోస్టర్ లలో పెద్దగా ప్రాముఖ్యత ఉండదు.తెలుగు సినిమా ల్లో నటించే చిన్న స్టార్స్ కు గుర్తింపు ఎంత ఉంటుంది అంటే చాలా చాలా తక్కువ అనడంలో సందేహం లేదు.

 Karthikeya First Look In Ajith Valimai Movie-మన కుర్ర హీరోను ఎక్కడో ఉంచిన తమిళ సూపర్‌ స్టార్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని వాలిమై చిత్ర ఫస్ట్‌ లుక్ లో హీరో అజిత్ తో సమానమైన గౌరవం గుర్తింపు మరియు ప్రాముఖ్యత ను కార్తీకేయ దక్కించుకున్నాడు.

కార్తికేయ విలన్ గా నటించిన గ్యాంగ్‌ లీడర్‌ నిరాశ పర్చింది.

ఆ సినిమా లో కార్తికేయ నటన మంచి మార్కులను దక్కించుకుంది.అందుకే వాలిమై సినిమా లో ఆయన విలన్ పాత్రను దక్కించుకున్నాడు.

అజిత్‌ మూవీ అంటే పాన్ ఇండియా లో మంచి బజ్‌ ఉంటుంది.అలాంటి సినిమా లో నటించినందుకు గాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కార్తికేయ కు మంచి ఫాలోయింగ్ దక్కే అవకాశం ఉంటుంది.

Telugu Ajith, Film News, Kaarthikeya, Karthikeya Villain Role, Tamil Film, Tollywood Hero, Vaalimai, Vaalimai First Look-Movie

ఇదే సమయంలో విలన్ గా నటించిన కార్తికేయ తెలుగు లో హీరోగా నటిస్తున్నాడు.వాలిమై సినిమా సక్సెస్ అయ్యి తమిళం లో మంచి గుర్తింపు దక్కించుకుంటే అక్కడ కూడా ఈయన హీరో గా నటించే అవకాశాలు దక్కించుకుంటాడు.లేదంటే తెలుగు లో ఈయన నటించిన సినిమా లు అన్ని కూడా అక్కడ డబ్‌ అయ్యి విజయాన్నిసొంతం చేసుకుంటాయనే నమ్మకం వ్యక్తం అవుతుంది.మొత్తానికి మన కుర్ర హీరో ను అజిత్‌ ఎక్కడికో తీసుకు వెళ్లబోతున్నట్లుగా అనిపిస్తుంది.

#Kaarthikeya #Ajith #Vaalimai #Vaalimai #Tamil

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు