టీజర్ టాక్: చావు కబురు చల్లగా చెప్పి మెప్పించిన బస్తీ బాలరాజు

యంగ్ హీరో కార్తికేయ ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్‌లో అదిరిపోయే హిట్ అందుకున్నాడు.ఈ సినిమా ఇచ్చిన గుర్తింపుతో కార్తికేయ వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు.

 Karthikeya Chaavu Kaburu Challaga Teaser Impressive-TeluguStop.com

ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చావు కబురు చల్లగా’ ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి సక్సెస్ అందుకోవాలని గట్టిగా చూస్తున్నాడు ఈ హీరో.

కాగా తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఈ టీజర్ చూస్తుంటే పూర్తి మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

 Karthikeya Chaavu Kaburu Challaga Teaser Impressive-టీజర్ టాక్: చావు కబురు చల్లగా చెప్పి మెప్పించిన బస్తీ బాలరాజు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పెగళ్ళపాటి కౌశిక్ అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కార్తికేయ ‘బస్తీ బాలరాజు’ అనే పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో శవాలను స్మశానికి తరలించే పాత్రలో హీరో నటిస్తున్నట్లు మనకు టీజర్ చూస్తే తెలుస్తోంది.

ఇక సీనియర్ నటి ఆమని హీరో తల్లిగా నటిస్తోంది.ఈ సినిమాలో మాస్ ప్రేక్షకులను మెప్పించే అంశాలు మెండుగా ఉన్నాయని చిత్ర యూనిట్ తెలిపింది.

ఇక ఈ సినిమాలో అందాల భామ లావణ్య త్రిపాఠీ హీరోయిన్‌గా నటిస్తోందని, ఆమెతో కార్తికేయ కెమిస్ట్రీ సూపర్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

మొత్తానికి ఈ టీజర్‌తో ప్రేక్షకులను మెప్పించడంతో కార్తికేయ ఈ సినిమాతో హిట్ కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

కాగా ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఈ సినిమాలో బస్తీ బాలరాజు పాత్రలో ఊర మాస్ లుక్ 2లో కార్తికేయ బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

మరి ఈ సినిమాతో కార్తికేయ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అనేది చూడాలి.ఈ సినిమా టీజర్‌ను మీరూ ఓసారి చూసేయండి.

#Karthikeya #Rx100 #ChavuKaburu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు